close
Choose your channels

పునర్జన్మల నేపథ్యంలో నాని

Wednesday, October 28, 2020 • తెలుగు Comments

పునర్జన్మల నేపథ్యంలో నాని

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ పాటికి ‘ట‌క్ జ‌గ‌దీష్’ మూవీ పూర్తై ఉండేది. దాదాపు ఆరు నెలల తర్వాత షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. దీని తర్వాత నాని నటించబోయే చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌’. ఇది పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో నానిలో మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయి. నాని స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. ఇప్పటి వరకు సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేసుకోబోతున్నారట. త్వరలోనే అదెవరనేది తెలుస్తుంది.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. ఓ ప్రేమ‌క‌థ హైద‌రాబాద్‌లో, మ‌రో ప్రేమ‌క‌థ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో ర‌న్ అవుతుంది. కోల్‌క‌త్తాలో జరిగే పార్ట్ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 26 సినిమాలు చేసిన నాని, త‌న కెరీర్‌లో తొలిసారి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సినిమా చేయ‌డం విశేషం.

Get Breaking News Alerts From IndiaGlitz