జాతీయ జెండా ఎగురేసిన నేచురల్ స్టార్ నాని

  • IndiaGlitz, [Thursday,August 15 2019]

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాని ముఖ్య అతిథిగా పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చాక ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించిందన్నారు. ఈ సందర్భాన్ని చూసి తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని.. ఆగస్టు 15 , జనవరి 26న జరిగే జెండా పండుగ అంటే చిన్నప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవాడినని నాని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన.. ఇవాళ తాను జెండాను ఆవిష్కరిస్తానని అస్సలు ఊహించలేదుని.. మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. ఇంత మంది చిన్న పిల్లల మధ్యలో... నేను కూడా చిన్నవాడినై పోతే బాగుండు అనిపించిందన్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి నాని ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు, రాజ శేఖర్ రెడ్డి, జెమినీ కిరణ్, ఆదిశేషగిరి రావు ,గిరి బాబు, మోహన్ ముళ్ళపూడి, కిషోర్, శివారెడ్డి, భగీరథ, కాజా సూర్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

More News

తాట తీస్తా.. రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవడానికి తామేం బిజినెస్‌మెన్‌లు కాదని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చిన విషయం విదితమే. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ పెద్దలెవరూ వైఎస్ జగన్‌ను

ఏడాది పూర్తి చేసుకున్న గీత గోవిందం

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం". టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా

సీనియర్ బాలీవుడ్ నటి కన్నుమూత

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి విద్యా సిన్హా(71)ఈరోజు ముంబైలోని జుహూ హాస్పిటల్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఈమె గుండె, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ విడుదల

'భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా... జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు... ఫెళఫెళఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా.. వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు... సరిలేరు నీకెవ్వరు...

టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత శివ గణేశ్ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో వనస్థలిపురంలోని తన నివాసంలో శివగణేశ్ కన్నుమూశారు.