close
Choose your channels

ఎన్టీఆర్ మామకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నారా రోహిత్

Monday, March 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ మామకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నారా రోహిత్

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సొంత కటుంబంలోని వ్యక్తులను ఆయన పట్టించుకోరని.. ముఖ్యంగా ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడ్ని గొలుసులతో కట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా బాబు సోదరుడి కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ప్రకటన రూపంలో నార్నెకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

రోహిత్ మాటల్లోనే...

"మీ ప్రయోజనాల కోసం మా మధ్య విభేదాలు సృష్టించొద్దు. నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌‌గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్న చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న(రామ్మూర్తి నాయుడు) మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్యవ భేదాలు సృష్టించొద్దు. నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. కనుకనే మేమంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా మధ్య ఉన్న బంధంపై బురద చల్లకండి. రాష్ట్ర ప్రజలతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడుస్తారు" అని నారా రోహిత్ చెప్పుకొచ్చారు.

మీకేం తెలుసు..?

"నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలకు, పంచాయతీ భవనాలకు ఇచ్చామనే విషయాన్ని మరిచిపోకండి. మాకు రాష్ట్ర అభివృద్దే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం, అసత్యం. రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఏవిధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని అదేవిధంగా చూసుకుంటున్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయి మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్‌ కుటుంబానిది. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అటువంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ?ప్రతి సంవత్సరం మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.ముఖ్యమంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా గడుపుతున్నారు. మా అందరికీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికే పరిమితమయ్యారు.రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేకనే.. కుటుంబ సభ్యులపై, వారి వ్యక్తిగత విషయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నారా కుటుంబంలో చీలికలు మనస్పర్థలు తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం మీ దివాళా కోరు తనానికి నిదర్శనం" అని నారా రోహిత్ ప్రకటనలో విమర్శకులకు ముఖ్యంగా నార్నెకు చురకలంటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.