నారా రోహిత్ తో బెంగాలి భామ

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

బాణం', సోలో', ప్రతినిధి' వంటి భిన్నమైన కథలతో విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు నారా రోహిత్. అయితే గత కొంత కాలంగా ఈయనకి సరైన హిట్ లేదనే చెప్పుకోవాలి. ఇదిలా వుంటే...ప్రస్తుతం పరుచూరి మురళి డైరెక్షన్లో ఆటగాళ్ళు' సినిమాలో నటిస్తున్నారు రోహిత్. గత అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్రెండ్స్ మూవీస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రోహిత్ సరసన బెంగాలీ భామ దర్శన బానిక్ కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే పి.సి.చంద్ర జ్యూవెలర్స్, వొడాఫోన్, బోరోలీన్, ఫ్యూచర్ గ్రూప్, వివేల్ తదితర టీవి యాడ్స్ తో పాటు...కలర్స్ ఛానల్ లో పలు సీరియల్స్ లో కూడా నటించిన అనుభవం ఉంది ఈ బెంగాలి భామకి. కాగా, ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంతోనైనా.. రోహిత్ మళ్ళీ స‌క్సెస్‌ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. నారా రోహిత్ నటిస్తున్న మరో రెండు చిత్రాలు వీరభోగ వసంతరాయలు', పండగలా వచ్చాడు' చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

More News

మరో రొమాంటిక్ ఫిల్మ్ లో సుమంత్

'మళ్ళీ రావా' చిత్రంతో చాలా కాలం తర్వాత విజయాన్ని చవి చూసారు హీరో సుమంత్.

మహేష్ 25.. పూర్తిగా న్యూయార్క్ లోనే..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే.

దసరాను టార్గెట్ చేసుకున్న నాగశౌర్య

‘ఛలో' సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో వరుసగా సినిమాలను ఓకే చేస్తూ ముందుకు సాగుతున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య.

రాజకీయాలను టచ్ చేస్తున్న 'రంగస్థలం'

ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే..ఇప్పుడైతే చాలా మాధ్యమాలు ఉన్నాయి.

'ఇష్టంగా.. సంతోషంగా..ఆనందంగా' అంటున్న ర‌చ‌యిత‌

కథా రచయితలు దర్శకులుగా మారడం అన్నది తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. నిన్నటి తరం సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల నుంచి నేటి తరం డైరెక్టర్ వక్కంతం వంశీ వరకు చాలా మంది రచయితలుగా కెరీర్‌ను ఆరంభించి అనంత‌రం దర్శకులుగా రూపాంతరం చెందినవారే.