close
Choose your channels

నారా రోహిత్ తో బెంగాలి భామ

Sunday, February 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాణం`, సోలో`, ప్రతినిధి` వంటి భిన్నమైన కథలతో విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు నారా రోహిత్. అయితే గత కొంత కాలంగా ఈయనకి సరైన హిట్ లేదనే చెప్పుకోవాలి. ఇదిలా వుంటే...ప్రస్తుతం పరుచూరి మురళి డైరెక్షన్లో ఆటగాళ్ళు` సినిమాలో నటిస్తున్నారు రోహిత్. గత అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్రెండ్స్ మూవీస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రోహిత్ సరసన బెంగాలీ భామ దర్శన బానిక్ కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే పి.సి.చంద్ర జ్యూవెలర్స్, వొడాఫోన్, బోరోలీన్, ఫ్యూచర్ గ్రూప్, వివేల్ తదితర టీవి యాడ్స్ తో పాటు...కలర్స్ ఛానల్ లో పలు సీరియల్స్ లో కూడా నటించిన అనుభవం ఉంది ఈ బెంగాలి భామకి. కాగా, ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంతోనైనా.. రోహిత్ మళ్ళీ స‌క్సెస్‌ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. నారా రోహిత్ నటిస్తున్న మరో రెండు చిత్రాలు వీరభోగ వసంతరాయలు`, పండగలా వచ్చాడు` చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.