క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

  • IndiaGlitz, [Monday,January 14 2019]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌న్న‌డ సినిమాలో న‌టించనున్నారా? అంటే సినీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ 125వ చిత్రం 'భైర‌తి ర‌ణ‌గ‌ల్‌' రూపొంద‌నుంది. ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తుంది.

బాల‌కృష్ణ 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'లో శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకు ప్ర‌తిగా ఆయ‌న చిత్రంలో బాల‌కృష్ణ అతిథి పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. మ‌రి దీనిపై బాల‌కృష్ణ స‌న్నిహిత వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. బాలకృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతి ఆ 'య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు' విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

More News

'కె.జి.ఎఫ్' మ‌రో సంచ‌ల‌నం

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ‌తో స్టార్ హీరో య‌ష్ న‌టించిన 'కె.జి.ఎఫ్' క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ విజయాన్ని సాధించింది.

మార్చి 1న అల్లు శిరీష్ ఏబిసిడీ గ్రాండ్ రిలీజ్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.  ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్ కిషన్ చిత్రం

యువ కథానాయకుడు సందీప్ కిషన్, "సుబ్రహ్మణ్యపురం" చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో

నా పిల్లల సాక్షిగా ప్రభాస్‌తో ఎలాంటి సంబంధంలేదు..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ- టాలీవుడ్ హీరో ప్రభాస్‌ల‌కు మధ్య సంబధం ఉందని..

'అక్ష‌ర' మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

నందితాశ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్నఅక్ష‌ర మూవీ మోష‌న్ పోస్ట‌ర్ భోగి సంద‌ర్బంగా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.