నవనీత్ కౌర్ కు షాక్.. క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు, ప్రమాదంలో పదవి!

  • IndiaGlitz, [Tuesday,June 08 2021]

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఫేక్ సర్టిఫికేట్ విషయంలో ఆమె వివాదం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం బాంబే హై కోర్టు నుంచి ఆమెకు గట్టి దెబ్బ తగిలింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు కోర్టు చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి: వావ్.. ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో రాజశేఖర్ రొమాన్స్

నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ని కోర్టు రద్దు చేసింది. రూ.2 లక్షల ఫైన్ కూడా విధించింది. నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.

నవనీత్ కౌర్ తన పదవిని ఎలా కాపాడుకుంటారో అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఆమెకు ఎంపీగా కొనసాగే అర్హత లేదంటూ శివసేన మాజీ ఎంపీ ఆనందరావు సవాల్ చేశారు. తాను శివసేన ప్రభుత్వం నుంచి ఆ పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నవనీత్ కౌర్ చెబుతోంది.

మార్చిలో శివసేన నేత అరవింద్ సావంత్ లోక్ సభ లాబీలో తనని బెదిరించినట్లు ఆరోపించింది. శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో మాట్లాడితే జైలుకి పంపిస్తామని బెదిరించినట్లు నవనీత్ తెలిపింది. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. తనకు శివసేన నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, యాసిడ్ దాడి చేస్తామని కూడా బెదిరిస్తున్నట్లు నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొంది.

More News

వావ్.. ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో రాజశేఖర్ రొమాన్స్

ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ హీరో రాజశేఖర్ తనదైన శైలిలో విజయాలతో దూసుకుపోయారు. ఆ తర్వాత కొంత కాలం పాటు రాజశేఖర్ కెరీర్ నెమ్మదించింది.

సీత' పాత్ర కోసం రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పురాణగాధల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ రామాయణం నేపథ్యంలో 'ఆదిపురుష్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

'వకీల్ సాబ్' బ్యూటీ బ్లాస్టింగ్ సెక్సీ లుక్స్

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల టాలీవుడ్ లో రాణించేందుకు అవసరమైన గుర్తింపు తెచ్చుకుంది. నటిగా ఆమెకు మంచి మార్కులు పడుతున్నాయి.

'ఫ్యామిలీ మ్యాన్'కి బీజం అలా పడిందా.. మహేష్ బాబుతో నిజమేనా?

రాజ్ అండ్ డీకే.. ఇండియాలో వెబ్ సిరీస్ ల అభిమానులని ఊపేస్తున్న ద్వయం వీరు. తెలుగువారై ఉండి బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.

మారుతి దర్శకత్వంలో 'ఏక్ మినీ కథ' హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా!

'ఏక్ మినీ కథ' హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీగా మారుతున్నాడు.