close
Choose your channels

మారుతి దర్శకత్వంలో 'ఏక్ మినీ కథ' హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా!

Tuesday, June 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మారుతి దర్శకత్వంలో ఏక్ మినీ కథ హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా!

'ఏక్ మినీ కథ' హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీగా మారుతున్నాడు. ఏక్ మినీ కథ చిత్రం అడల్డ్ కామెడీ అయినప్పటికీ ఒక మంచి సెక్స్ ఎడ్యుకేషన్ సందేశాత్మక చిత్రంగా అందరిని ఆకట్టుకుంది. సైజు చిన్నదనే ఆత్మన్యూనతతో బాధపడే యువకుడిగా శోభన్ బాగా చేశాడు. 

ఇదీ చదవండి: దేశంలోనే యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్.. మహేష్ బాబుకు ఫిదా!

ప్రస్తుతం శోభన్ కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఓ సర్ ప్రైజింగ్ ఆఫర్ శోభన్ కి దక్కినట్లు తెలుస్తోంది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో నటించే అవకాశం దక్కిందట. అంతే కాదు ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొందరు ఫిలిం మేకర్స్ పగటి సమయంలో షూటింగ్స్ జరుగవుతున్నట్లు టాక్. అందుకే మారుతి, సంతోష్ శోభన్ చిత్రం కూడా ప్రారంభమైందట. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో శోభన్ కి జంటగా క్రేజీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ నటిస్తోంది. దర్శకుడు మారుతి కేవలం నెలరోజుల్లోనే చక్కటి కథాంశంతో స్క్రిప్ట్ పూర్తి చేశారట. కేవలం రెండు మూడు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం మారుతి హీరో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. గోపీచంద్ నటిస్తున్న 'సీటిమార్' పూర్తయ్యాక ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.