మూడే రోజులు కేటాయించిన న‌య‌న‌

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియ‌స్ మూవీ 'సైరా న‌ర‌సింహారెడ్డి'. బ్రిటీష్ వారిని ఎదిరించి తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

ఈ చిత్రంలో లేడీ సూప‌ర్‌స్టార్ నయ‌న‌తార న‌ర‌సింహా రెడ్డి భార్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ కోసం న‌య‌న‌తార మూడు రోజులు డేట్స్ కేటాయించింది. ఈ మూడు రోజుల్లో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి వీలైన‌న్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది.

More News

అల‌నాటి హీరోయిన్‌గా మాళ‌విక‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సూర్య స‌పోర్ట్‌

ప్ర‌స్తుతం తెలుగులో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. తెలుగుతో పాటు త‌మిళంలో కూడా నోటా చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.

ఒక్క‌టైనా ర‌ణ‌వీర్‌, దీపిక‌

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనెల వివాహం ఇట‌లీలోని లేక్ కోమోలో జ‌రిగింది. ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన వీరి పెళ్లి తంతు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింద‌ట‌.

శ్రీ కృష్ణ క్రియేషన్స్ విడుదల చేస్తున్న 'నెక్ట్స్ ఏంటి'

యూత్ లో తమన్నా గ్లామర్ కున్న ఫాలోయింగ్ గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువ హీరోల్లో మంచి సక్సెస్ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు.

అర్జున్ పెట్టిన కేసును ర‌ద్దు చేయాల‌న్నశృతి

ప్ర‌స్తుతం దేశంలోని హాట్ టాపిక్స్‌లో మీ టూ ఉద్య‌మం ఒక‌టి. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు ఈ ఉద్య‌మంలో లైంగిక ఆరోప‌ణ‌లను ఎదుర్కొన్న‌వారే.