close
Choose your channels

మూడే రోజులు కేటాయించిన న‌య‌న‌

Thursday, November 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూడే రోజులు కేటాయించిన న‌య‌న‌

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియ‌స్ మూవీ `సైరా న‌ర‌సింహారెడ్డి`. బ్రిటీష్ వారిని ఎదిరించి తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

ఈ చిత్రంలో లేడీ సూప‌ర్‌స్టార్ నయ‌న‌తార న‌ర‌సింహా రెడ్డి భార్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ కోసం న‌య‌న‌తార మూడు రోజులు డేట్స్ కేటాయించింది. ఈ మూడు రోజుల్లో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి వీలైన‌న్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.