close
Choose your channels

అందుకే... నేను.. శైలజ క్యారెక్టర్ చేసాను - హీరోయిన్ కీర్తి సురేష్

Monday, December 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్రం నేను...శైల‌జ‌. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా నేను... శైల‌జ జ‌న‌వ‌రి 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా నేను..శైల‌జ గురించి హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట‌ర్ వ్యూ మీకోసం...

మీ గురించి...?

నాన్న మ‌ల‌యాళం సినిమా నిర్మాత‌. దాదాపు 30 ఏళ్ల నుంచి 30 సినిమాలు నిర్మించారు. అమ్మ‌ న‌టి. తమిళ్, మ‌ల‌యాళంలో చాలా సినిమాల్లో న‌టించారు. అమ్మ‌ ఓ తెలుగు సినిమాలో కూడా న‌టించారు.నాకు ఓ సిస్ట‌ర్ ఉంది. త‌ను విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్ లో యానిమేష‌న్ చేసింది. క్రిష్ 3, చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీల‌కు గ్రాఫిక్స్ వ‌ర్క్ చేసింది.

నేను..శైల‌జ సినిమాలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?

నేను త‌మిళ్ సినిమా ర‌జ‌నీ మురుగ‌న్ సినిమా చేస్తున్న‌ప్పుడు డైరెక్ట‌ర్ కిషోర్ వ‌చ్చి ఈ సినిమా కోసం క‌లిసారు. ఆ టైంలో మ‌రో తెలుగు సినిమా కోసం నేను హైద‌రాబాద్ లోనే ఉన్నాను. అప్పుడు కిషో్ర్ స్టోరీ లైన్ చెప్పారు. ఆత‌ర్వాత చెన్నై వ‌చ్చి పుల్ స్రిప్ట్ చెప్పారు. కిషోర్ క‌థ చెబుతుంటే అస‌లు బోర్ అనిపించ‌లేదు. అలా వింటూనే ఉన్నాను. ఇందులో ఎమోష‌న్, కామెడీ, డ్రామా...ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫాద‌ర్ అండ్ డాట‌ర్ మ‌ధ్య ఉండే ఎమోష‌న్ న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. అందుకే శైల‌జ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి వెంట‌నే ఓకె చెప్పేసాను. అలా....నేను...శైల‌జ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది.

సినిమా విష‌యానికి వ‌స్తే...క‌థ విన్న‌ప్పుడు మీకు న‌చ్చిన పాయింట్ ఏమిటి..?

ఈ సినిమాలో తండ్రి కూత‌రు మ‌ధ్య ఉండే ఎమోష‌న్ న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. స‌త్య‌రాజ్ సార్ కూతురుగా న‌టించాను. క‌థ‌, అలాగే ఈ సినిమాలోని స‌న్నివేశాలు, కామెడీ...ఇలా అన్నీ రియ‌లిస్టిక్ గా ఉండ‌డం నన్ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

టీజ‌ర్ లో...ఐ ల‌వ్ యు బ‌ట్ ఐయామ్ నాట్ ఇన్ ల‌వ్ విత్ యు అనే చెప్పారు క‌దా..చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. అలా చెప్ప‌డానికి కార‌ణం ఏమిటి..?

ఈ డైలాగ్ గురించి నేను ఎక్కువుగా చెప్ప‌లేను. నేను అలా అన‌డానికి కార‌ణం ఉంటుంది. నేను ఎందుకు అలా అన్నానో తెలుసుకోవాలంటే మీరు థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూసి తెలుసుకోండి. (న‌వ్వుతూ..)

రామ్ తో వ‌ర్క్ంగ్ ఎక్స్ పీరియ‌న్స్..?

రామ్ అంటే ఏమిటో ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. రామ్ ఎన‌ర్జి లెవెల్స్ సూప‌ర్. మంచి ప‌ర్ ఫార్మ‌ర్ అండ్ గుడ్ డాన్స‌ర్. ఏదైనా సీన్ చేసిన వెంట‌నే బాగా చేసానా లేదా..? ఇంకా బెట‌ర్ గా చేయ్యాలా..? అని అడుగుతాడు. రామ్ ఎప్పుడూ వ‌ర్క్ గురించే ఆలోచిస్తుంటాడు. వ‌ర్క్ ప‌ట్ల ఉన్న డేడికేష‌న్ వ‌ల్లే ఆ ఎన‌ర్జి వ‌స్తుంది అనుకుంటున్నాను.రామ్ నుంచి ఎంతో నేర్చుకున్నాను.

రామ్ వెరీ గుడ్ డాన్స‌ర్..? మ‌రి మీరు..?

య‌స్..రామ్ వెరీ గుడ్ డాన్స‌ర్. నేను డాన్స‌ర్ ..వెరీ గుడ్ ఆర్ నాట్ అనేది ప్రేక్ష‌కులే చెప్పాలి. కాక‌పోతే ఈ సినిమా చూసి కాదు. ఎందుకంటే శైల‌జ క్యారెక్ట‌ర్ కి డాన్స్ చేసేంత స్కోప్ లేదు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ గురించి..?

రామ్, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్ ఆల్రెడీ హిట్. ఈ సినిమాలోని ఐదు పాట‌లు సంద‌ర్భానుసారంగా వ‌స్తుంటాయి. ఆ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు దేవిశ్రీప్ర‌సాద్ మంచి ట్యూన్స్ అందించారు. ఈ సినిమాలో శైల‌జ అనే పాట నా ఫేవ‌రెట్ సాంగ్.

మీరు..ఫ‌స్ట్ మూవీకే న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర చేయ‌డం గురించి..?

అవును...నా ఫ‌స్ట్ మూవీకే న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర చేయ‌డం నిజంగా నా ల‌క్. అలాగే స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ లో సినిమా చేయ‌డం కూడా హ్యాపీ. ఆర్టిస్టుల నుంచి ఏక్టింగ్ ఎలా రాబ‌ట్టాలి. ఏ సీన్ లో ఎలా ఉంటే బాగుంటుంది ఇలా అన్ని విష‌యాల్లో ఫుల్ క్లారిటీ ఉంది డైరెక్ట‌ర్ కిషోర్ కి. ఇంత మంచి టీమ్ తో వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది.

స‌త్య‌రాజ్ గారితో న‌టించ‌డం ఎలా ఉంది..?

సెట్స్ లో చాలా స‌ర‌దాగా ఉండే వారు. చాలా విష‌యాలు చెప్పేవారు. స‌త్యరాజ్ గారితో వ‌ర్క్ చేయ‌డం మ‌రచిపోలేని అనుభూతి.

ఈ సినిమాలో హైలెట్ ఏమిటి..?

ఈ సినిమాలో ప్ర‌తిదీ రియ‌లిస్టిక్ గా ఉంటుంది. డ్రామా ఉన్నా...స‌హ‌జంగానే ఉంటుంది. ఫాద‌ర్, డాట‌ర్, స‌న్...ఇలా ఎవ‌రు ఈ సినిమా చూసినా ఖచ్చితంగా న‌చ్చుంది. అదే ఈ సినిమాకి హైలెట్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.