రాజ‌మౌళికి రామాయ‌ణం చేయాలంటూ నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌

ఓ సాధార‌ణ స‌న్నివేశాన్ని బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, రోమాలు నిక్క‌బొడుచుకునే యాక్ష‌న్‌, అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇప్పుడు ఆయ‌న‌కు నెటిజ‌న్స్ నుండి ఆస‌క్తిక‌ర‌మైన రిక్వెస్ట్ వ‌చ్చింది. అదేంటో తెలుసా? రామాయాణాన్ని తెర‌కెక్కించాల‌నే విన‌తి. ఇంత‌కూ ఈ రిక్వెస్ట్ ఎందుకో వ‌చ్చిందనే వివ‌రాల్లోకెళ్తే.. రామానంద్ సాగ‌ర్ 1987లో రామాయణాన్ని సీరియ‌ల్‌గా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌ళ్లీ ఈ సీరియ‌ల్‌ను పునఃప్రసారం చేస్తే ఎక్కువ మంది వీక్షించిన సీరియ‌ల్‌గా రామాయ‌ణం రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లువురు రామాయ‌ణంను రాజ‌మౌళిని డైరెక్ట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజ‌మౌళి మేక్ రామాయ‌ణ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ట‌ర్‌లో ఈ రిక్వెస్ట్ నెంబ‌ర్ వ‌న్‌గా ట్రెండ్ అయ్యింది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

More News

విజ‌య్ కూడా ఆ బ్యాచ్‌లో చేర‌బోతున్నాడు!!

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చే్స్తోన్న సంగ‌తి తెలిసిందే. పూరి, ఛార్మి స‌హా క‌ర‌ణ్‌జోహార్ నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తెలుగు రిపోర్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు కేంద్ర మంత్రి!

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలట్లేదు. డాక్టర్లను, మీడియాను, పోలీసులను.. పేద, ధనిక అని తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. ఇప్పటికే చెన్నై,

చైత‌న్య‌తో నాని సినిమా..!!

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగానే కాదు.. ప్రొడ‌క్ష‌న్‌లోకి కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌ఫై నాని ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమ‌ల‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

రేపు ఉదయం 'గాంధీ' సిబ్బందిపై హెలికాఫ్టర్లతో పూలవర్షం

కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ యుద్ధం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి పాత్ర ఎనలేనిదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వెంకన్నా.. నీ కొండను నువ్వే కాపాడుకో : నారా లోకేశ్

మే-01న టీటీడీ చైర్మన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.