close
Choose your channels

విజ‌య్ కూడా ఆ బ్యాచ్‌లో చేర‌బోతున్నాడు!!

Sunday, May 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ కూడా ఆ బ్యాచ్‌లో చేర‌బోతున్నాడు!!

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చే్స్తోన్న సంగ‌తి తెలిసిందే. పూరి, ఛార్మి స‌హా క‌ర‌ణ్‌జోహార్ నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా క‌రోనా రావ‌డం.. దాంతో సినిమా షూటింగ్ ఆగ‌డం జ‌రిగింది. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాతే త‌దుప‌రి షెడ్యూల్‌ను ఖ‌రారు చేస్తారు. ఈ సినిమా గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిపారు.

ఈ సినిమాకు ‘లైగ‌ర్’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇది బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కే సినిమా అని వార్త‌లు వినిపించాయి. దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ క్లారిటీ ఇచ్చారు. బాక్సింగ్ అనే కాకుండా మిక్సింగ్ మార్ష‌ల్స్ నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కిస్తార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమా కోసం తాను సిక్స్ ప్యాక్ చేస్తున్న‌ట్లు తెలిపారు. సాధార‌ణంగా పూరి త‌న సినిమాలో హీరోల‌ను సిక్స్ ప్యాక్ హీరోలుగా ప్రెజెంట్ చేస్తుంటారు. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్ ఇలా యువ హీరోల‌ను సిక్స్ ప్యాక్ హీరోలుగా ఆవిష్క‌రించిన పూరి ఈసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అదే బ్యాచ్‌లో చేర్చ‌బోతున్నాడ‌ట‌. మ‌రి సినిమా అనుకున్న స‌మ‌యంలో త‌న శ‌రీరం ఎలా స‌పోర్ట్ చేస్తుందో చూడాల‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ తాను చేయ‌బోయే సిక్స్ ప్యాక్ గురించి చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌పాండే ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.