సంజయ్‌దత్‌కు కొత్త సమస్య

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

సీనియర్ బాలీవుడ్ హీరో, నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం తెలుగు నుండి హిందీలోకి రీమేక్ అవుతున్న 'ప్రస్తానం' రీమేక్‌లో నటిస్తున్నారు. తెలుగులో ప్రస్థానం సినిమాను డైరెక్ట్ చేసిన దేవాకట్టానే బాలీవుడ్ ప్రస్థానంను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ షీమార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ 'ప్రస్థానం' కథా హక్కులు తమ దగ్గర ఉన్నాయంటూ నిర్మాతల్లో ఒకరైన సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు పంపారు. సంజయ్‌తో గతంలోనూ ఈ విషయంపై చర్చించినా ఆయనేం పట్టించుకోకుండా సినిమాను నిర్మిస్తున్నారంటూ స సదరు సంస్థ పేర్కొంది. మరి ఈ వార్తలపై దేవాకట్టా, సంజయ్ దత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

వైఎస్ జగన్ ఆదేశిస్తే నేను రెడీ..: పోసాని

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలిచి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం పీఠమెక్కాలని ఆకాంక్షించిన వారిలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు.

మెగాస్టార్‌ని టార్గెట్ చేసిన యువ హీరో

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో. హీరోగా ఆయనకున్న క్రేజే వేరు.

ఇదేం ఖర్మరా బాబూ... మత పిచ్చితో జొమాటో ఆర్డర్ రద్దు!

నిజంగా ఈ వార్త చదివిన తర్వాత ఎంత పిచ్చోడ్రా బాబూ.. అనుకోక తప్పదు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో ఇంటి ముందే అన్నీ వచ్చి వాలిపోతున్నాయ్..

ఆయన వల్లే బతికా.. ఇక చనిపోను: పోసాని

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వదంతులు వచ్చిన విషయం విదితమే.

‘సైమా’కు ముఖ్యఅతిథులుగా చిరు, మోహన్‌లాల్

పాంట‌లూన్స్ సైమా (సౌత్ ఇండియన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే.