close
Choose your channels

సంజయ్‌దత్‌కు కొత్త సమస్య

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంజయ్‌దత్‌కు కొత్త సమస్య

సీనియర్ బాలీవుడ్ హీరో, నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం తెలుగు నుండి హిందీలోకి రీమేక్ అవుతున్న `ప్రస్తానం` రీమేక్‌లో నటిస్తున్నారు. తెలుగులో ప్రస్థానం సినిమాను డైరెక్ట్ చేసిన దేవాకట్టానే బాలీవుడ్ ప్రస్థానంను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ షీమార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ `ప్రస్థానం` కథా హక్కులు తమ దగ్గర ఉన్నాయంటూ నిర్మాతల్లో ఒకరైన సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు పంపారు. సంజయ్‌తో గతంలోనూ ఈ విషయంపై చర్చించినా ఆయనేం పట్టించుకోకుండా సినిమాను నిర్మిస్తున్నారంటూ స సదరు సంస్థ పేర్కొంది. మరి ఈ వార్తలపై దేవాకట్టా, సంజయ్ దత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.