టాలీవుడ్ కి మరో న్యూ విలన్

  • IndiaGlitz, [Monday,July 24 2017]

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎలాంటి బ్యాక్-గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టం. అలా వచ్చి..తమ ట్యాలెంట్ నిరూపించుకొని టాలివుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు. ఈ హోప్స్ తోనే వచ్చిన తేజ గోవింద్ కూడా టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమా నాగచైతన్య కెరీర్ కి మంచి హిట్ ఇచ్చింది…అదే సినిమాతో తెరంగేట్రం చేసాడు తేజ గోవింద్. ఈ సినిమా తేజాకు చిన్న రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోయాడు తేజ.

అయితే..ఈమధ్య కాలంలో హీరోలతో పాటు విలన్లకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు తేజ కూడా విలన్' రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను, బెల్లకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న జయ జానకి నాయకి' సినిమాలో తేజ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సరైనోడు లో ఆది పినిశెట్టి విలన్ రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో..ఈ సినిమాలో తేజ క్యారెక్టర్ కూడా అంత కీలకంగా ఉంటుంది. లాస్-ఏంజెల్స్ లోని ప్రముఖ లీ స్ట్రాస్-బెర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన తేజ..టాలివుడ్ లో మరెన్నో సినిమాలు చేసి మంచి స్థాయిలో ఉండాలని ఆశిద్దాం..!

More News

దీపా మాలిక్ బయోపిక్

పారా ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం సాధించి పెట్టిన తొలి మహిళ దీపామాలిక్.

పవన్, త్రివిక్రమ్, నితిన్ ల సినిమా ప్రారంభం

పవర్ స్టార్ పవన్కల్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా సినిమా ప్రారంభం అయ్యింది.

ప్రభాస్ సినిమాలో మరో విలన్..

బాహుబలి చిత్రంతో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్.

నయనతార 'వాసుకి' సాంగ్ రిలీజ్ చేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ 'వాసుకి'సినిమాలోని సాంగ్ ను విడుదల చేశారు.

అమెరికా ఓహియో ఇంటర్ నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఉత్తమ నటుడిగా 'రక్తం' కు గానూ నామినేట్ అయిన బెనర్జీ!

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే అంతంత మాత్రమే.