close
Choose your channels

టాలీవుడ్ కి మరో న్యూ విలన్

Monday, July 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎలాంటి బ్యాక్-గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టం. అలా వచ్చి..తమ ట్యాలెంట్ నిరూపించుకొని టాలివుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు. ఈ హోప్స్ తోనే వచ్చిన తేజ గోవింద్ కూడా టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమా నాగచైతన్య కెరీర్ కి మంచి హిట్ ఇచ్చింది…అదే సినిమాతో తెరంగేట్రం చేసాడు తేజ గోవింద్. ఈ సినిమా తేజాకు చిన్న రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోయాడు తేజ.

అయితే..ఈమధ్య కాలంలో హీరోలతో పాటు విలన్లకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు తేజ కూడా విలన్` రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను, బెల్లకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న జయ జానకి నాయకి` సినిమాలో తేజ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సరైనోడు లో ఆది పినిశెట్టి విలన్ రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో..ఈ సినిమాలో తేజ క్యారెక్టర్ కూడా అంత కీలకంగా ఉంటుంది. లాస్-ఏంజెల్స్ లోని ప్రముఖ లీ స్ట్రాస్-బెర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన తేజ..టాలివుడ్ లో మరెన్నో సినిమాలు చేసి మంచి స్థాయిలో ఉండాలని ఆశిద్దాం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.