'నీర్వాణ సినిమాస్' ప్రొడక్షన్ నెం.1 'రాహుల్ విజయ్ , నీహారిక కొణిదెల చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,June 23 2018]

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ... ముద్దపప్పు ఆవకాయ్ నాన్నాకూచి వెబ్ సిరీస్ తరువాత మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాము. ఈ సినిమాకు సహకరిస్తున్న అందరికి కృతజ్ఞతలు అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ... డైరెక్టర్ ప్రణీత్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఈ సినిమా ఉంటుంది. నా మొదటి సినిమా ఈ మాయ పేరేమిటో సొంత నిర్మాణ సంస్థలో చేసాను. కథ నచ్చడంతో బయటి బ్యానర్ లో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. శివాజీ రాజా గారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అన్నారు.

నీహారిక కొణిదెల మాట్లాడుతూ... ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నీర్వాణ సినిమాస్ ఈ సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారు. వారికి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ప్రణీత్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా కొత్తగా తను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ్ నిహార్ మాట్లాడుతూ... మంచి కథ, కథనాలతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోంది. డైరెక్టర్ ప్రణీత్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుంది. నీహారిక కొణిదెలకు ఈ పాత్ర బాగా సెట్ అవుతుంది అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ... క్లారిటీ ఉన్న దర్శకుడు ప్రణీత్. గతంలో ప్రణీత్ తో నేను నాన్నకూచి వెబ్ సిరీస్ చేసాను. తను మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహించడం అందులో నేను ఒక ముఖ్య పాత్రలో నటించబోతుండడం ఆనందంగా ఉంది అన్నారు.

నటీనటులు: రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల, శివాజీ రాజా, సత్య, కోటేశ్వర రావ్ తదితరులు.

More News

'గీతగోవిందం' మెద‌టి లుక్‌

అర్జున్ రెడ్డి చిత్రం లో స్టార్‌డ‌మ్ ని సంపాయించట‌మే కాకుండా కొట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర కొండ హ‌రోగా,

వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌ల 'ఎఫ్‌2' ప్రారంభం

వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపే అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్‌తో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత‌.... మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ తో 'ఫిదా'

విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌...

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

సెన్సేష‌న‌ల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తోన్నవిజ‌యేంద్ర ప్ర‌సాద్..

అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ ర‌చ‌యిత‌గానే ఉన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయ్‌జాన్ చిత్రాల‌తో స్టార్ రైటర్‌గా ప్యాన్ ఇండియాలో పేరు సంపాదించుకున్నారు.

మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో నందితాశ్వేతా

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' వంటి హార‌ర్ చిత్రంలో దెయ్యం ప‌ట్టి అమ్మాయి పాత్ర‌లో మెప్పించిన హీరోయిన్ నందితా శ్వేత‌.