నిఖిల్ 20 ఖ‌రారు!!

  • IndiaGlitz, [Friday,July 31 2020]

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ వ‌రుస సినిమాల‌ను అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఈయ‌న తాను చేయ‌బోయే 20వ సినిమా గురించిన అధికారికంగా ప్ర‌క‌టించారు. నిఖిల్ 20వ సినిమాను ఏషియ‌న్ గ్రూప్స్ అధినేత నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, రెయిన్ బో రీల్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ‘మీతో క‌లిసి ప‌నిచేయ‌నుండ‌టం ఆనందంగా ఉంది.. మీ స‌హాయ స‌హ‌కారాలు ఉంటే మరింత పెద్ద సినిమాలు చేయ‌గలం’ అంటూ నిఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.

రీసెంట్‌గా డాక్ట‌ర్ ప‌ల్ల‌విని పెళ్లి చేసుకున్న నిఖిల్ ఇక త‌దుప‌రి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు. అర్జున్ సుర‌వ‌రం హిట్ త‌ర్వాత నిఖిల్ త‌నకు బ్రేక్ ఇచ్చిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే త‌దుప‌రి సినిమాను కూడా నిఖిల్ క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ‘లవ్‌స్టోరి’తో పాటు, నాగార్జున, ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రాల‌ను ఏషియ‌న్ సినిమా గ్రూప్ నిర్మిస్తోంది.

More News

అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో  #AA21

అల వైకుంఠపురం లో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తో  సరి కొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పి, అదే ఉత్సహంతో వరుస సినిమాలుతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు

9 మందిని పొట్టనబెట్టుకున్న శానిటైజర్..

ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

తాత గొప్ప‌త‌నం ఈరోజు ఇంకా బాగా తెలుస్తుంది:  అల్లు అర్జున్‌

ఈరోజు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి. ఆయ‌న 16 వ‌ర్ధంతి నేడు. సినీ ప్రియులు, ఆయన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు.

బర్త్ డే సందర్భంగా వలస కార్మికులకు సోనూసూద్ సర్‌ప్రైజ్..

పుట్టినరోజు చేసుకుంటున్న వారికి సన్నిహితులు బహుమతులిచ్చి సర్‌ప్రైజ్ చేయడం కామన్‌. కానీ రీల్ లైఫ్ విలన్..

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ పునర్నియామకం..

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గురువారం అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తూ జీవో జారీ చేసింది.