సినిమా కోసం హ‌నీమూన్ వాయిదా!!

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ప్ర‌స్తుతం పెళ్లి కంటే సినిమా మూడ్‌లోనే ఉన్న‌ట్లున్నాడు. 'అర్జున్ సుర‌వరం' స‌క్సెస్ త‌ర్వాత నిఖిల్ 'కార్తికేయ2' సినిమా షూటింగ్‌ను తిరుప‌తిలో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయి ప‌ల్ల‌వి శ‌ర్మ‌ను ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నాడు. మ‌రి పెళ్లికి, హానీమూన్‌కి ఎన్నిరోజులు సెల‌వు తీసుకుంటున్నావ‌ని నిఖిల్‌ను ఓ ఇంట‌ర్వ్యూలో అడిగితే త‌ను మాట్లాడుతూ ‘‘వీకాఫ్ తీసుకుని పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లికి ప్రత్యేకంగా సిద్ధం కావడానికి సమయం లేదు. పెళ్లి ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి. కానీ నేను ప్రస్తుతం సినిమాపైనే ఫోకస్ పెట్టాను. అందుకనే హానీమూన్ని వాయిదా వేసుకున్నాను’’ అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ‘‘సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకున్నాం. కాబట్టి కాలంతో వేగంగా పరిగెత్తుతున్నాం. స్వాతి కార్తికేయలో నటించిన పాత్రలోనే నటిస్తున్నారు. ఆమెతో పాటు మరో హీరోయిన్‌ని కూడా తీసుకున్నాం. ఆరు నెలలు పాటు ప్రీ ప్రొడక్షన్‌పై స్క్రిప్ట్‌పై వ‌ర్క్ చేశాం. ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డ‌మే కాదు. వేదాల గురించి కూడా తెలుసుకున్నాం. కార్తికేయ వ‌చ్చి ఆరేళ్లు అవుతుంది. దానికి సీక్వెల్‌గా కార్తికేయ‌2 ఇంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు ఫ్రెష్‌గా ఫీల్ అవుతుండ‌టం సంతోషంగా అనిపిస్తుంది’’ అన్నారు.

More News

ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ ముహూర్తం కుదిరింది

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో

‘మ‌ధ’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా

బాలయ్యను కూడా బాబు మోసం చేస్తాడేమో.. : ప్రాణ స్నేహితుడు

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రభాస్ సరసన ‘మల్లీశ్వరి’ బ్యూటీ!

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

'లవ్ స్టొరీ' 'ఏయ్ పిల్లా' సాంగ్  మార్చి11విడుదల

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో