close
Choose your channels

ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ ముహూర్తం కుదిరింది

Wednesday, March 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ ముహూర్తం కుదిరింది

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాపై ప్ర‌భాస్ చాలా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసి న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ 20వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం యూర‌ప్‌లోని జార్జియాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. లాంగ్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గానే ప్ర‌భాస్ ఛేజింగ్ సీన్‌ను చిత్రీక‌రించారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. చిత్ర యూనిట్ యూర‌ప్ వెళ్లే ముందే ఫొటో షూట్ జ‌రిగింద‌ని నాలుగు పోస్ట‌ర్స్‌లో రెండింటిని ఉగాదికి విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌.

ఈ పీరియాడికల్ ప్రేమ‌క‌థా చిత్రాన్ని హిందీ, తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 16న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రానికి ఓ డియ‌ర్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.