సెన్సార్ కార్యక్రమాల్లో నిన్నే చూస్తూ.. ఏప్రిల్ విడుదల

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమ‌ల‌త (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా కె.గోవ‌ర్ధ‌న్‌రావు దర్శకత్వంలో హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌గా రూపొందిన చిత్రం నిన్నే చూస్తూ. ఈ చిత్రంలో నాటితరం హీరో హీరోయిన్లు సుహాసిని, సుమన్, భాను చందర్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇటీవల వైజాగ్ పరిసరప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకొన్న ఈ చిత్రం సెన్సార్ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది.

నిన్ను చూస్తూ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దాదాపు సినిమా పనులు పూర్తికావొస్తుండటంతో చిత్రం యూనిట్‌ సభ్యుల సమక్షంలో నిర్మాత హేమలతారెడ్డి టీజర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాత హేమ‌ల‌తా రెడ్డి మాట్లాడుతూ నిన్నే చూస్తూ సినిమా ఒక్క అందమైన ప్రేమకథ చిత్రం. మానవ విలువలతో మనసుకు హత్తుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించిన చిత్రం. మా సినిమా త్వరలోనే సెన్సార్‌కు వెళ్లబోతున్నది. అన్ని పనులు పూర్తి చేసుకొన్న తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేస్తాం అని అన్నారు. ఏప్రిల్‌లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

నటీనటులు: నితిన్ (రెండో హీరో ), భాను చందర్, సుమన్, కాశీ విశ్వనాధ్ , సాయాజీ షిండే , రజిత , విద్య లతా, నిహాల్, వేణు, మహేష్ , ఫణి , రమణ్, జ్యోతిరెడ్డి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.

More News

మ‌ల్టీస్టార‌ర్ రీమేక్‌పై క్లారిటీ...

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `విక్ర‌మ్ వేద` చిత్రాన్ని తెలుగులో, హిందీలో రీమేక్ చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు.. పోలీస్ ఆఫీస‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన గౌత‌మ్ మీన‌న్ ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

రాజ‌శేఖ‌ర్ అల‌క‌...

మా ఎన్నిక‌ల్లో న‌రేష్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంగ్ పోటీ చేసిన డా.రాజ‌శేఖ‌ర్ స‌హా నరేష్ ప్యానెల్ ..

'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం రోజే కోటను అవమానించిన నరేశ్!

‘మా’ (మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కమిటీ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యింది.