నితిన్ కి తలనొప్పి తెస్తున్న కళ్యాణ్..

  • IndiaGlitz, [Sunday,September 06 2015]

ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే' వంటి హిట్స్ తో ట్రాక్ లోకి వచ్చిన నితిన్ చిన్నదాన నీకోసం' చిత్రంతో ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే రెండున్నరేళ్ళ క్రితం గౌతమ్ మీనన్ సమర్పణలో గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందుతోన్న సినిమా కొరియర్ బాయ్ కల్యాణ్'. ప్రేమ్ సాయి దర్శకుడు.

ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమాని నిర్మాతలు సెప్టెంబర్ 11న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే చూడబోతుంటే సినిమా అనుకున్నతేదీలో విడుదల కావడం లేదు. అందుకు కారణం సెన్సార్ కాకపోవడమేనట. చిన్న సినిమాలు దాదాపు ఎడెనిమిది సెన్సార్ వరుసలో ఉండటంతో కొరియర్ బాయ్ కళ్యాణ్ సెన్సార్ అనుకున్న సమయంలో సెన్సార్ కాదనే వార్తలు వినపడుతున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. ఏదేమైనా నితిన్ తనకిష్టమైన పవన్ కళ్యాణ్ పేరుతో స్టార్ట్ చేసిన సినిమా నితిన్ పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతుందన్నమాట.

More News

క్రిస్మస్ కానుకగా గోపీచంద్ , రవికుమార్ చౌదరి చిత్రం

'యజ్ఞం'తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, ఏయస్ రవికుమార్ చౌదర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'కంచె' ఓవర్ సీస్ హక్కులను...

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

క్లాసిక్ సితార కాదంటున్నారు మరి...

జీనస్ ఫిలింస్ బ్యానర్పై సురేంద్ర జి.ఎల్ దర్శకత్వంలో రవికుమార్ డి.ఎస్. నిర్మించే చిత్రం సితార. రవిబాబు, రవనీత్ కౌర్, సుమన్ ప్రధానపాత్రల్లో నటించారు.

'కృష్ణాష్టమి' టీజర్ రివ్యూ...

కమెడియన్ గా కెరీర్ ను స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ సునీల్.

మెగా వార్ లో...విజేత ఎవరు..?

మెగా హీరోలు మధ్య వార్ మొదలైంది.ఇంతకీ మెగా హీరోల మధ్య వార్ ఏమిటనుకుంటున్నారా..?వారం గ్యాప్ తో ముగ్గురు మెగా హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.