నితిన్ , హను రాఘవపూడి 14 రీల్స్ 'లై' చిత్రంలోని మూడోపాట విడుదల

  • IndiaGlitz, [Tuesday,August 01 2017]

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు 'బాంభాట్‌', 'మిస్‌ సన్‌షైన్‌' విడుదలై సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రంలోని 'ఏడమ్మా ఏడే ఏడేడే వరుడే..' అంటూ సాగే మూడో పాటను మంగళవారం రేడియో సిటీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గేయరచయిత కృష్ణకాంత్‌, సింగర్స్‌ సాయిచరణ్‌, సాహితి, ఆదిత్య మ్యూజిక్‌ మాధవ్‌, నిరంజన్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గేయరచయిత కృష్ణకాంత్‌ మాట్లాడుతూ - ''ఇది పెళ్ళి సిట్యుయేషన్‌లో వచ్చే హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌. ఇది తెలంగాణ నేపథ్యంలో వుంటుంది. గతంలో పెళ్ళిపాటలు చాలా వచ్చాయి. ఈ పాటని మణిశర్మగారు చాలా డిఫరెంట్‌గా చేశారు. హను రాఘవపూడితో నా జర్నీ అందాల రాక్షసితో మొదలైంది. కృష్ణగాడి వీరప్రేమగాథలో కూడా పాటలు రాశాను. ఇప్పుడు 'లై' చిత్రంలో మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ పాటకు లిరిక్‌ రాసిన తర్వాతే మణిశర్మగారు ట్యూన్‌ చేశారు. దాదాపు పది ట్యూన్స్‌ రెడీ చేసి అందులో ది బెస్ట్‌ ట్యూన్‌తో ఈ పాటను ఇచ్చారు. ఇంతకుముందు విడుదలైన రెండు పాటలు కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అలాగే ఈ పాట కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆగస్ట్‌ 11న విడుదలవుతున్న సినిమా కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.
సింగర్‌ సాయిచరణ్‌ మాట్లాడుతూ - ''మణిశర్మగారు ఈ పాటకు తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ నాతో బాగా పాడించారు. ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయగానే అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంత మంచి పాట నాతో పాడించిన మణిశర్మగారికి థాంక్స్‌'' అన్నారు.
సింగర్‌ సాహితి మాట్లాడుతూ - ''ఒక డిఫరెంట్‌ సాంగ్‌ని పాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ పాటకు కృష్ణకాంత్‌గారు చాలా మంచి సాహిత్యం అందించారు. నా కెరీర్‌లో ఈ పాట చాలా పెద్ద హిట్‌ అవుతుంది. మణిశర్మగారి మ్యూజిక్‌ డైరెక్షన్‌లో నేను పాడిన 6వ పాట ఇది. మణిశర్మగారి నుంచి నేనెంతో నేర్చుకున్నాను'' అన్నారు.
యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

అజిత్ అభిమానులకు నిరాశ..

తమిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో వరుసగా చేస్తున్న సినిమా 'వివేకం'(తమిళంలో వివేగం).

నిజ ఘటన ఆధారంగానే 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్' సినిమా చేశాను - నరసింహ నంది

'1940లో ఓ గ్రామం','హైస్కూల్','కమలతో నా ప్రయాణం','లజ్జ'వంటి విభిన్న కథాంశాలతో

నా హీరో గ్రేట్ అంటున్న సమంత...

ఆ హీరో మరెవరో కాదు, సమంత కు మనసైనోడు,కాబోయే భర్త నాగ చైతన్య.

శ్రీకాంత్, అల్లరి నరేష్ లు అభినందించిన వశం

వాసుదేవరావు - శ్వేతా వర్మ జంటగా చల్లా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వశం. సినిమా రంగం పై మక్కువ కలిగిన పలువురు యువతీయువకులు తలా కొంత డబ్బులు వేసుకొని నిర్మించిన చిత్రం ఈ వశం.

'జవాన్' మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.