close
Choose your channels

నితిన్ , హను రాఘవపూడి 14 రీల్స్ 'లై' చిత్రంలోని మూడోపాట విడుదల

Tuesday, August 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు 'బాంభాట్‌', 'మిస్‌ సన్‌షైన్‌' విడుదలై సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రంలోని 'ఏడమ్మా ఏడే ఏడేడే వరుడే..' అంటూ సాగే మూడో పాటను మంగళవారం రేడియో సిటీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గేయరచయిత కృష్ణకాంత్‌, సింగర్స్‌ సాయిచరణ్‌, సాహితి, ఆదిత్య మ్యూజిక్‌ మాధవ్‌, నిరంజన్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గేయరచయిత కృష్ణకాంత్‌ మాట్లాడుతూ - ''ఇది పెళ్ళి సిట్యుయేషన్‌లో వచ్చే హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌. ఇది తెలంగాణ నేపథ్యంలో వుంటుంది. గతంలో పెళ్ళిపాటలు చాలా వచ్చాయి. ఈ పాటని మణిశర్మగారు చాలా డిఫరెంట్‌గా చేశారు. హను రాఘవపూడితో నా జర్నీ అందాల రాక్షసితో మొదలైంది. కృష్ణగాడి వీరప్రేమగాథలో కూడా పాటలు రాశాను. ఇప్పుడు 'లై' చిత్రంలో మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ పాటకు లిరిక్‌ రాసిన తర్వాతే మణిశర్మగారు ట్యూన్‌ చేశారు. దాదాపు పది ట్యూన్స్‌ రెడీ చేసి అందులో ది బెస్ట్‌ ట్యూన్‌తో ఈ పాటను ఇచ్చారు. ఇంతకుముందు విడుదలైన రెండు పాటలు కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అలాగే ఈ పాట కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆగస్ట్‌ 11న విడుదలవుతున్న సినిమా కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.
సింగర్‌ సాయిచరణ్‌ మాట్లాడుతూ - ''మణిశర్మగారు ఈ పాటకు తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ నాతో బాగా పాడించారు. ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయగానే అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంత మంచి పాట నాతో పాడించిన మణిశర్మగారికి థాంక్స్‌'' అన్నారు.
సింగర్‌ సాహితి మాట్లాడుతూ - ''ఒక డిఫరెంట్‌ సాంగ్‌ని పాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ పాటకు కృష్ణకాంత్‌గారు చాలా మంచి సాహిత్యం అందించారు. నా కెరీర్‌లో ఈ పాట చాలా పెద్ద హిట్‌ అవుతుంది. మణిశర్మగారి మ్యూజిక్‌ డైరెక్షన్‌లో నేను పాడిన 6వ పాట ఇది. మణిశర్మగారి నుంచి నేనెంతో నేర్చుకున్నాను'' అన్నారు.
యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.