ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...

  • IndiaGlitz, [Sunday,March 17 2019]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రైన నితిన్ ఇప్పుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ అనే సినిమా చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్ల‌నుంది. కాగా.. ఈ సినిమా త‌ర్వాత నితిన్ ఓ ప్లాప్ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయబోతున్నాడ‌ట‌.

ఇంత‌కు ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకున్నారు.. ఒకప్పుడు, నితిన్‌కు గుండెజారి గ‌ల్లంత‌య్యిందే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్‌. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో ఒక లైలా కోసం సినిమా చేశాడు విజ‌య్ కుమార్ కొండ‌.

ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో.. విజ‌య్ కుమార్ కొండ‌తో మ‌రేవ‌రూ సినిమా చేయ‌లేదు. ఆ త‌ర్వాత విజ‌య్ కుమార్ కొండ ల‌వ్ మ్యారేజ్ చేసుకోవ‌డం.. కొన్ని కుటుంబ స‌మస్య‌ల కార‌ణంగా విజ‌య్ కుమార్ మ‌రో సినిమా చేయ‌లేక‌పోయాడు.

రీసెంట్ టైంలో నితిన్‌కు క‌లిసి ఓ లైన్‌ను వినిపించాడ‌ట‌. నితిన్‌కు కూడా లైన్ బాగా న‌చ్చ‌డంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడ‌ట‌. అంతా ఓకే అయితే మ‌రోసారి నితిన్‌తో విజ‌య్ కుమార్ కొండ సినిమా చేస్తాడు.

More News

సెన్సార్ బోర్డు పై వ‌ర్మ కేసు..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు సెన్సార్ బోర్డుపై గుర్రుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా!

డియర్ కామ్రేడ్ మే 31న విడుదల

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్  బెన్  సినిమాస్ పతాకాల పై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్".

సాయిధ‌ర‌మ్‌తో మ‌రోసారి..

ఆరు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప్రేక్ష‌కులు ముందుకు వ‌స్తున్న చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'.

న‌య‌న‌తార 'ఐరా' ఈ నెల‌ 28న విడుద‌ల‌

న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన 'ఐరా' ఈ నెల 28న విడుద‌ల కానుంది. గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది.

ఆకాష్ పూరి 'రొమాంటిక్‌'లో మ‌క‌రంద్ దేశ్ పాండే

యువ క‌థానాయ‌కుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం 'రొమాంటిక్‌'. ఆకాష్ జోడిగా కేతికా శ‌ర్మ న‌టిస్తుంది.