నితిన్ పెళ్లి తేది, వేదిక ఖ‌రారు !

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

నితిన్ ఇంత వ‌ర‌కు త‌న పెళ్లి డేట్‌ను ఖ‌రారైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జూలై 26న హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌నామా ఫ్యాలెస్‌లో నితిన్‌, షాలినిల పెళ్లి జ‌ర‌గ‌నుంది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ 16న దుబాయ్‌లో జ‌ర‌గాల్సిన నితిన్ పెళ్లి క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. దీంతో డిసెంబ‌ర్‌లో నితిన్ పెళ్లి జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు నితిన్ పెళ్లి గురించి ఇరు కుటుంబాల పెద్ద‌లు ఓ క్లారిటీకి వ‌చ్చారు. ఆషాఢం పూర్తి కాగానే నితిన్ పెళ్లి చేయాల‌ని, ఇరువురి జాత‌కాల ప్ర‌కారం జూలై 26న నిర్వ‌హించాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ప్రజలు ఒక‌చోట చేయ‌డానికి ఇబ్బందిగా మారింది. ఈసమ‌యంలో పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు పెళ్లిళ్లు జ‌రుపుకుంటున్నారు. ఆ కోవ‌లో సినీ నిర్మాత దిల్‌రాజు త‌న రెండో వివాహాన్ని త‌న కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌నే జ‌రుపుకున్నారు. అలాగే హీరో నిఖిల్ కూడా ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను కూడా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మ‌ధ్య‌నే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవ‌లే మిహీక‌తో రోకా వేడుక‌ను జ‌రుపుకున్న రానా కూడా ఆగ‌స్ట్ 8న పెళ్లి చేసుకోబోతున్నారు.

More News

నటి పూర్ణ కేసు విచారణలో మరో కొత్త విషయం వెలుగులోకి..

నటి పూర్ణ(షామ్నా ఖాసిం) కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా

హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షల కోసం సంప్రదించాల్సిన కేంద్రాలివే..

హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వారికి గుడ్‌న్యూస్.. రూ.10 వేలున్న జీతాన్ని 28 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

ప్రపంచంలో వాళ్లకో ప్రత్యేక స్థానముంది. పలు సందరభాల్లో వారు చూపిన చొరవకు ప్రపంచమే ఫిదా అయిపోయింది.

ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ ఇన్నాళ్లకు ఓటీటీలో విడుదల

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. ఉదయ్ మరణం ఎంతో మంది అభిమానులను కలచివేసింది. ‘చిత్రం’

డిస్నీ చేతికి రామోజీ ఫిలింసిటి?

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా కూల్చేసిందనేది కొందరి వాదన. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతో పాటు రామోజీ ఫిలింసిటీ కూడా గుర్తొస్తుంది.