ట్రాఫిక్‌కు భ‌య‌ప‌డ్డ నితిన్ ఏం చేశాడంటే!!

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

హీరో నితిన్ త‌న కొత్త సినిమా 'భీష్మ‌' చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తొలి రోజు చిత్రీక‌ర‌ణ ముగిసిందో లేదో .. కానీ కొత్త స‌మ‌స్య స్టార్ట్ అయ్యింది నితిన్‌కి. ఇంత‌కు నితిన్ ఫేస్ చేసిన స‌మ‌స్యేంటో తెలుసా!. ట్రాఫిక్ స‌మ‌స్య‌. ట్రాఫిక్‌ను దాటుకుని ఇంటికి చేరుకోవ‌డానికి కారు కంటే మెట్రో రైలు బెట‌ర్ అనుకుని దాంట్లో ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. మెట్రోలో తీసుకున్న ఫోటోల‌ను నితిన్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అభిమానులు కూడా నితిన్‌తో సెల్ఫీలు దిగారు.