నిత్యానంద సరికొత్త లీల.. కొత్తదేశం ఏర్పాటు!

  • IndiaGlitz, [Thursday,December 05 2019]

వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. ఈ పేరు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆధ్యాత్మికత అనేది పక్కనెడితే ఈయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు, ఆరోపణలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. కర్నాటకలో నమోదైన రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం కొన్ని బృందాలుగా విడిపోయిన పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఆయన మాత్రం ఇండియాను వదిలేసి పారిపోయాడు.

స్వామిగారి సరికొత్త లీల!
కేసుల నుంచి బయటపడటానికి ఇలా చేస్తున్నారో..? లేకుంటే ఉత్తిత్తి హడావుడి చేస్తున్నారో తెలియట్లేదు కానీ.. తాను సెంట్రల్ లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనుగోలు చేశానని.. దాన్ని సొంత దేశంగా ప్రకటించుకోవడం గమనార్హం. అంతేకాదండోయ్ ఆ దేశానికి ‘కైలాస’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. కైలాసకు వెళ్లాలంటే సొంతంగా పాస్‌పోర్టు కావాలట. ఆ పాస్ పోర్టులు ఉంటేనే కైలాసలోకి అనుమతులు ఉంటాయట. జాతీయ జెండా, జాతీయ చిహ్నాలు కూడా పెట్టుకున్నారట. ఇదంతా తన మాయక భక్తుల కోసం త్యాగాలు చేస్తున్నాడట. కైలాస దేశం కోసం kailaasa.org పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించాడు. కైలాస అంటే ఈ భూమండలంపై ఉన్న గొప్ప హిందూ దేశమని చెప్పుకుంటున్నాడు. అంటే ప్రపంచ పటంలో ఇది కొత్త దేశం అన్న మాట.

రాజ్యంగంతో సహా అన్నీ ప్రత్యేకమే..!
కాగా.. ‘కైలాస’ దేశ అధికార భాషలు: ఇంగ్లిష్‌, సంస్కృతం, తమిళం అని.. అధికారిక మతం: సనాతన హిందూ ధర్మం, జాతీయ జంతువు: నంది, జాతీయ పక్షి: శరభం, జాతీయ పుష్పం: పద్మం, జాతీయ వృక్షం: మర్రి చెట్టు అని ఆయనకు ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. ‘కైలాస’ దేశం కోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నాడు. మొత్తం అందులో 547 పేజీలున్నాయి. అంతేకాదు.. ఇవన్నీ అటుంచితే ఈ దేశం విషయంలో తనకు అన్ని అనుమతులు ఇచ్చి.. కైలాస దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్యసమితికి ఒక పిటిషన్‌ సమర్పించుకున్నాడు. మరి ఐక్యరాజ్యసమితి ఎలా రియాక్ట్ అవుతుందో.. అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే స్వామిగారి వ్యవహారంపై నెట్టింట్లో పలువురు ప్రముఖులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు, సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

నేనెప్పుడూ ఉల్లి తిన్లేదు.. రేట్లు నాకెలా తెలుస్తాయ్: కేంద్ర మంత్రి

ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో

'దొంగ' తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న రావూరి వి. శ్రీనివాస్

'ఖైదీ'లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్నయాంగ్రీ హీరో కార్తీ హీరోగా

డిసెంబర్‌ 25న 'ఇద్దరిలోకం ఒకటే'

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇద్దరి లోకం ఒకటే'.

'హేజా' మున్నాకాశికి నటుడిగా,దర్శకుడిగా మంచి గుర్తింపునిస్తుంది - త‌నికెళ్ళ భ‌రణి

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి  హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం "హేజా".  (ఎ మ్యూజికల్ హారర్).  వి ఎన్ వి  క్రియేషన్స్ పతాకంపై

దిశ ఘటన: పవన్‌ కల్యాణ్‌పై సుమన్ ఫైర్

హైదరాబాద్‌‌లోని శంషాబాద్‌లో చోటుచేసుకున్న ‘దిశ’ హత్య ఉదంతంపై తెలుగు రాష్ట్రాలు మొదలుకుని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.