వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర - నివేదా పేతురాజ్‌

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

నేను పుట్టింది తమిళనాడులో..పెరిగింది దుబాయ్‌లో. అమ్మ తమిళియన్ నాన్న తెలుగువారు. ఇప్పటి వరకు తమిళ్‌లో నాలుగు చిత్రాల్లో నటించాను. రెండు విడుదలయ్యాయి. మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'మెంటల్ మదిలో' నా తొలి తెలుగు చిత్రం అని అంటుంది హీరోఇయ‌న్ నివేదా పేతురాజ్‌.

'పెళ్ళిచూపులు' త‌ర్వాత డి.సురేష్ బాబు సవుర్పణలో దర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'మెంటల్ మదిలో'. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ " . సినిమాల్లోకి రాకముందు దుబాయ్ లో కొన్ని కంపెనీలకు మోడలింగ్ చేశాను. 2015 లో దుబాయ్ మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. ఆ సమయంలో తమిళ్ డైరెక్టర్ నెల్సన్ గారు చూసిన నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా సినీ రంగంలోకి అడుగుపెట్టాను. మెంటల్ మది సినిమాలో 'స్వేచ్చ' అనే ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో కనపడతాను.

వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర అది. ఈ క్యారెక్టర్ లో ఎక్కువగా నటించలేదు. ఎందుకంటే సహజంగా ఉంది కాబట్టి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. అలాగే నా కోస్టార్ శ్రీవిష్ణు చాలా మంచివాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు. మొదటి నాలుగు రోజులు మాట్లాడుకోకుండా వర్క్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించినా ఆ తరవాత కలిసిపోయాం.

ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రేమలో ప్రేమించే వాళ్ళను వెతుక్కోవాలి, వాళ్ళతో డేట్ కు వెళ్ళాలి. అవన్నీ కష్టం.అతనితో వర్క్ చాలా బాగుంది. తమిళంలో సినిమాలు సైన్ చేస్తున్నాను. తెలుగులో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను" అన్నారు.

More News

కాలేజీ డేస్ గుర్తుకొచ్చాయంటున్న హీరోయిన్‌..

ర‌ష్మిక మండ‌న్నా..కిరిక్ పార్టీతో స‌క్సెస్ కొట్టి, ఆ ద‌ర్శ‌కుడితోనే ప్రేమ‌లో మునిగిన ఈ అమ్మ‌డు తెలుగులో నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న 'ఛలో' చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

సీక్వెల్ హీరోయిన్‌గా అనన్య‌..

అనన్య అంటే జ‌ర్నీ చిత్రంలో న‌టించిన హీరోయిన్ కాదు..బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న అన‌న్య పాండే. విల‌క్ష‌ణ న‌టుడు చంకీ పాండే కుమార్తె ఈమె.

ఈ 24న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు.

'ఖాకి' ఇంట్రస్టింగ్ లొకేషన్స్

సినిమా చూస్తున్నంత సేపు మనకు లొకేషన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సినిమాల్లో చూసిన లొకేషన్లనే చూపించడం ఒక పద్ధతి. కానీ అప్పటిదాకా ప్రేక్షకుడికి అనుభవంలో లేని లొకేషన్లను కళ్లకు కట్టడం మరో పద్ధతి.

నవంబ‌ర్ 24న 'నెపోలియ‌న్‌' సంద‌డి

ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్‌'. ఆనంద్‌ రవి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు.