మ‌ళ్ళీ బిజీ అవుతున్న నివేదా

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

రెండేళ్ళ క్రితం విడుద‌లైన జెంటిల్ మ‌న్ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నివేదా థామ‌స్‌. ఆ త‌రువాత నిన్ను కోరి, జై ల‌వ కుశ చిత్రాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో హ్యాట్రిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

అయితే ఆ త‌రువాత విడుద‌లైన జూలియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్ నిరాశ‌ప‌రిచింది. గ‌త కొంత కాలంగా చ‌దువుపై దృష్టి పెట్టిన నివేదా.. మ‌ళ్ళీ వ‌రుస‌గా సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న సినిమాలో షాలిని పాండేతో పాటు మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్న నివేదా.. తాజాగా మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మెంట‌ల్ మ‌దిలో, నీదీ నాదీ ఒకే క‌థ చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ విష్ణు హీరోగా న‌టించ‌నున్న‌ ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఈ రెండు సినిమాల్లోనూ న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంది నివేదా. మొత్తానికి.. గ్యాప్ తీసుకున్నా మ‌ళ్ళీ వ‌రుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది నివేదా.

More News

రానా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు

ప్ర‌స్తుతం ఇండియన్ స్క్రీన్‌పై బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.

శంభో శంకర టీజర్ ను లాంచ్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'శంభో శంక‌ర'.

'విశ్వ‌రూపం 2' ట్రైల‌ర్ డేట్ ఫిక్స్‌

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'.

అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్' టైటిల్ లాంచ్

బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3 గా వస్తున్న చిత్రం "సిల్లీ ఫెల్లోస్".

'దేశంలో దొంగలు ప‌డ్డారు' టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మా గౌత‌మ్ నిర్మిస్తున్న చిత్రం 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'.