close
Choose your channels

'విశ్వ‌రూపం 2' ట్రైల‌ర్ డేట్ ఫిక్స్‌

Friday, June 8, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`విశ్వ‌రూపం 2` ట్రైల‌ర్ డేట్ ఫిక్స్‌

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. గ్లోబల్ టెర్రరిజం నేప‌థ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ‘విశ్వరూపం’ (2013)కి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ ర‌విచంద్ర‌న్ మ‌రో నిర్మాత‌. అతుల్ తివారి, కమల్ హాసన్ కథను అందించారు.

ఇక కమల్ సరసన పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండ‌గా రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదారెహ్మాన్ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరిలో విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. రాజకీయాల్లోకి రాబోతున్న కమల్‌కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి. లెటెస్ట్‌స‌మాచారం ప్ర‌కారం ఈసినిమా ట్రైల‌ర్ జూన్ 11న విడుద‌ల కానుంది. తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త‌మిళంలో శృతిహాస‌న్‌, హిందీలో అమీర్‌ఖాన్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.