'ఊపిరి'లో అవి లేవ‌ట‌

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించే అంశాల‌లో పాట‌ల‌కి, పోరాట స‌న్నివేశాల‌కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ ఫైట్ సీన్స్‌తో అస్స‌లు సంబంధం లేకుండా ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపొందుతోంది. అదే 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా.. క‌థ రీత్యా ఎలాంటి పోరాటాల‌కు తావు లేకుండా తెర‌కెక్కింద‌ట‌. ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే 'ఊపిరి'కి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

More News

వ‌రుణ్‌తేజ్‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా?

'కంచె'తో న‌టుడిగా మెప్పించాడు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వ‌ల్ల వ‌రుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫ‌ర్' పై అంద‌రి దృష్టి ప‌డింది.

వెంకీ న్యూమూవీ డేట్ ఫిక్స్..

విక్ట‌రీ వెంక‌టేష్ గోపాల గోపాల త‌ర్వాత ఏ సినిమా చేయ‌లేదు. చాలా క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ ఏది పూర్తి స్ధాయిలో సంత్రుప్తి క‌లిగించ‌లేదు. ఆఖ‌రికి యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి చెప్పిన క‌థ వెంకీకి బాగా న‌చ్చింది. దీంతో మారుతికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

భారీ సెట్టింగ్ లో బాల‌య్య సాంగ్..

నంద‌మూరి న‌ట సింహాం బాల‌య్య న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు.

సంక్రాంతి బ‌రిలో నాగ్..

కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క్రిష్ణ తెర‌కెక్కిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ అంత తీసుకుంటున్నాడా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మురుగుదాస్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.