మార్పులేం లేవంటున్న ఛార్మి

‘స్క్రిప్టులో మార్పులా అలాంటి దేమీ లేదు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఫైటర్ బ్లాక్ బస్టర్ స్ర్కిప్ట్. మేం చాలా నమ్మకంగా ఉన్నాం. త్వ‌ర‌లోనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెబుతోంది నిర్మాత ఛార్మి. అసలేం జరిగిందనే వివరాల్లోకెళ్తే.. పూరి కొన్ని విష‌యాల్లో చాలా నిక్క‌చ్చిగా ఉంటాడు. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయిన త‌ర్వాత మార్పులంటే ఎవ‌రు చెప్పినా విన‌డు. ఇది ఇండ‌స్ట్రీలో విన‌ప‌డేమాట‌. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్నిరోజుల పాటు ముంబైలో షూటింగ్ కూడా జ‌రిగింది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ కూడా ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే.

జ‌నవ‌రి నెల‌లో ముంబైలో షూటింగ్ ప్రారంభ‌మైంది. కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగింది. అయితే క‌రోనా ప్ర‌భావం ఎక్కువ కావ‌డంతో లాక్‌డౌన్ విధించారు. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఆ నేప‌థ్యంలో పూరి సినిమా కూడా ఆగింది. ఇప్పుడిప్పుడే అంద‌రూ సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌నుకుంటున్నారు. అయితే విదేశీ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్‌, ఫారిన్ షెడ్యూల్స్‌ను అనుకున్న‌ట్లుగా చిత్రీక‌రించ‌లేక‌పోతున్నారని అందుకు పూరి స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ఛార్మి క్లారిటీ ఇచ్చింది. స్క్రిప్ట్‌లో మార్పులేమీ చేయ‌డం లేద‌ని చెప్పి రూమ‌ర్స్‌కు చెక్ పెట్టేసింది.

More News

కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టింది: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయేత కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

నితిన్ పెళ్లి ప్రీ పోన్ కానుందా?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ప్రజలు ఒక‌చోట చేయ‌డానికి ఇబ్బందిగా మారింది. ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు.

టీడీపీలో జగన్ నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?

ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి.

మ‌ళ్లీ వెన‌క్కి వెళుతున్న‌ ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది.

ఇంట్లోనే కూర్చొని మీకు కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు: డాక్టర్ సంధ్య

గత కొద్ది రోజులుగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి కరోనా. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఈ మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.