close
Choose your channels

రిస్క్ చేయడం మానేసాం - ఎన్టీఆర్

Wednesday, August 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన జ‌న‌తా గ్యారేజ్ సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. విభిన్న క‌థాంశంతో రూపొందిన జ‌న‌తా గ్యారేజ్ గురించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
జ‌న‌తా గ్యారేజ్ లో రిస్కీ ఫైట్స్ ఏమైనా చేసారా..?
వ‌య‌సు పెరుగుతుంది క‌దా...రిస్క్ చేయ‌డం మానేసాం జాగ్ర‌త్త ప‌డుతున్నాం.(న‌వ్వుతూ..)
ఇంత‌కీ...జ‌న‌తా గ్యారేజ్ లో ఏ ఏ రిపేర్స్ చేస్తారు..?
మ‌నుషుల‌ను, కార్లును రిపేర్ చేస్తుంటాం. ఇంకా చెప్పాలంటే....సొసైటీని రిపేర్ చేస్తుంటాం.
జ‌న‌తా గ్యారేజ్ ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుంది అనుకుంటున్నారు..?
క‌లెక్ష‌న్స్, రికార్డ్స్ అనే నెంబ‌ర్ గేమ్ లో ఇరుక్కుపోయాం. ఒక్క ఏక్ట‌ర్ అనే కాదు ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ అంద‌రి పై ఈ ప్రెజ‌ర్ ఉంది. అందుచేత ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుంది అనేది రిలీజ్ త‌ర్వాత మాట్లాడుకుంటే బెట‌ర్ అని నా అభిప్రాయం. అలాని నేను స‌క్సెస్ వ‌స్తే ఎంజాయ్ చేయ‌ను. ఫెయిల్యూర్ వ‌స్తే బాధ‌ప‌డ‌ను అని కాదు. కాక‌పోతే ఫెయిల్యూర్ వ‌స్తే.... ఇంత‌కు ముందు కంటే ఇప్పుడు కాస్త త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డుతున్నాను.
జ‌న‌తా గ్యారేజ్ లో కొత్త ఫ్యామిలీ డ్రామా ఉంటుంద‌ని కొర‌టాల శివ చెప్పారు. ఏమిటా కొత్త‌ద‌నం..?
జ‌న‌తా గ్యారేజ్ గొప్ప కుటుంబ క‌థా చిత్రం. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉన్న కుటుంబం. నిజంగానే కొత్త ఫ్యామిలీ డ్రామా అది ఏమిటి అనేది తెర పై చూస్తే బాగుంటుంది.
కొర‌టాల శివ క‌థ చెప్పిన‌ప్పుడు మీకు ఏమ‌నిపించింది..?
శివ క‌థ చెప్పిన‌ప్ప‌టి నుంచి ఈ క‌థ న‌న్ను వెంటాడుతూనే ఉంది. క‌థ అంతా ఒక ఎత్తు అయితే...క‌థ‌లో ఉన్న పాత్ర‌లు ఒక ఎత్తు. ముఖ్యంగా ప్ర‌కృతి మొత్తం మ‌న‌లో ప్ర‌తి బింబం... అది ఆలోచిస్తే అర్ధ‌మ‌వుతుంది. నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ రోల్ చేసాను. ఇలాంటి సినిమా కోస‌మే క‌దా మ‌నం ఎదురుచూస్తుంది అనిపించింది.
టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో...జ‌న‌తా గ్యారేజ్...ఈ మూడు చిత్రాల్లో మీ లుక్స్ లో చాలా ఛేంజ్ క‌నిపిస్తుంది. ఛేంజ్ కోసం ఏం చేసారు..?
హీరో ప్ర‌కృతిని ప్రేమిస్తుంటాడు. అందుచేత హీరో లుక్ ఇలా ఉండాలి అని ప్ర‌తి విష‌యంలో చాలా క్లారిటీగా ఉన్నాడు శివ‌. అలాగే నా స్టైలీష్ట్ కూడా నాకు కంఫ‌ర్ట్ గా లేనివి కూడా కంఫ‌ర్ట్ గా ఉండేలా డిజైన్ చేసాడు. అందుకే మీకు నా లుక్ లో ఛేంజ్ కనిపిస్తుంది.
ఈ సినిమాలో ప్ర‌కృతిని ప్రేమిస్తారు క‌దా...నిజ జీవితంలో..?
సినిమా అనేది అంద‌మైన అబ‌ద్ధం. సినిమాల్లో మ‌నం చేసే క్యారెక్ట‌ర్స్ తో కొన్నింటికి క‌నెక్ట్ అవుతుంటాం. జ‌న‌తా గ్యారేజ్ లో నా క్యారెక్ట‌ర్ నా మ‌న‌సుకు ఎక్కువగా అని చెప్ప‌ను కానీ...కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉన్న క్యారెక్ట‌ర్. అందుక‌నే మా అబ్బాయి కూడా ప్ర‌కృతి గురించి చెబుతున్నాను.
మాస్ ఆడియోన్స్ కి జ‌న‌తా గ్యారేజ్ ఎలా ఉంటుంది..?
తెలుగు ప‌దాల్లో ఱ అనే అక్ష‌రాన్ని తీసేసిన‌ట్టుగా మాస్ అనే ప‌దాన్ని కూడా తొలిగించాలి. మాస్ అంటే ఎక్కువ మంది చూసిన దాన్ని మాస్ అంటాం. ర‌చ‌యిత గుండెతో ఆలోచిస్తే...ద‌ర్శ‌కుడు బుర్ర‌తో ఆలోచిస్తాడు. ఈ రెండింటిని మిక్స్ చేసి శివ మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు తీసాడు. ఎ, బి, సి అనే తేడాలు లేకుండా యూనివ‌ర్శిల్ గా అంద‌రూ ఆద‌రించేలా తీసారు. అలాగే జ‌న‌తా గ్యారేజ్ కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది.
మ‌ల‌యాళ అగ్ర హీరో మోహ‌న్ లాల్ తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్..?
మోహ‌న్ లాల్ గారితో ఏడు నెల‌ల జ‌ర్నీ. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో న‌న్ను బాగా ఇన్ స్పైయిర్ చేసారు. ఆయ‌న న‌టుడు, నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్...ఇన్ని బాధ్య‌లు నిర్వ‌హిస్తూ ఏమాత్రం టెన్ష‌న్ లేకుండా చాలా ప్ర‌శాంతంగా ఉంటారు. అలా ఉండ‌డం చాలా క‌ష్టం. అది న‌న్ను బాగా ఇన్ స్పైయిర్ చేసింది.
మ‌ల‌యాళంలో జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌మోష‌న్స్ కి వెళుతున్నారా..?
ప్ర‌మోష‌న్స్ కి వెళ్లాలి అని ప్లాన్ ఉంది. ఎప్పుడు అనేది త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తాం.
మ్యూజిక్ ప‌రంగా మీ ఇన్ వాల్వ్ మెంట్ ఎంత వ‌ర‌కు ఉంటుంది..?
తెలుగులో ఓ సామెత ఉంది గుర్రం చేసే ప‌ని గుర్రం చేయాలి గాడిద చేసే ప‌ని గాడిద చేయాలి (న‌వ్వుతూ...) ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయినా స‌రే...మంచి పాట ఇవ్వాలి అంటే...ఫ‌స్ట్ క‌థ ఇన్ స్పైయిర్ చేయాలి. ఆత‌ర్వాత డైరెక్ట‌ర్ ఇన్ స్పైయిర్ చేయాలి. ఆత‌ర్వాత హీరో ఇన్ స్పైయిర్ చేయాలి. ఇలా...క‌థ‌, డైరెక్ట‌ర్, హీరో ఇన్ స్పైయిర్ చేస్తే మంచి పాట వ‌స్తుంది. అంతే కానీ...నేనేదో నాకు ఇలా కావాలి అంటూ ఇన్ వాల్వ్ అవ్వను. ఈ సినిమాలో పాట‌ల విష‌యానికి వ‌స్తే...ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగానే ఉంటుంది. నేను లోక‌ల్ అనే స్పెష‌ల్ సాంగ్ కూడా ఏదో కావాలి అని పెట్టింది కాదు. సంద‌ర్భానుసారంగానే ఉంటుంది.
జ‌న‌తా గ్యారేజ్ మూవీ చూసారు క‌దా..మీకు ఏమ‌నిపించింది..?
చూసాను చాలా బాగుంది అనిపించింది. గ‌తంలో ఫ్లాప్ మూవీస్ కి కూడా ఇలాగే చెప్పానేమో...(న‌వ్వుతూ..) హిట్ అయితే అంత‌క‌న్నా మంచి సినిమా చేయాలి అనిపిస్తుంటుంది. ఫ్లాప్ అయితే మ‌ళ్లీ హిట్ సినిమా చేయాలి అనిపిస్తుంటుంది. ఇదొక గేమ్..!
జ‌న‌తా గ్యారేజ్ ఆడియో ఫంక్ష‌న్ లో మీరు మాట్లాడిన మాట‌ల్లో నిజాయితీ క‌నిపించింది. మీలో మార్పు రావ‌డానికి కార‌ణం ఏమిటి..?
అంటే...అంత‌కు ముందు మాట్లాడిన మాట‌ల్లో నిజాయితీ లేదంటారా....(న‌వ్వుతూ..). ప‌దేళ్ల క్రితం మీరైనా, నేనైనా ఒక‌లా ఉండ‌చ్చు. ఇప్పుడు ఇంకోలా ఉండ‌చ్చు. మార్పు అనేది స‌హ‌జం. అది లైఫ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల వ‌ల‌న కావ‌చ్చు. ఎదురైనా మ‌నుషుల వ‌ల‌న కావ‌చ్చు. ముప్పైలోకి వ‌చ్చేసాను. వ‌య‌సు పెరుగుతుంది క‌దా...బ‌హుశా అందువ‌ల‌న వ‌చ్చిందేమో.
డ్యాన్స్ విష‌యంలో మీలో మార్పు వ‌చ్చిన‌ట్టుంది..?
అవునండి. గ‌తంలో అయితే దెయ్యం ప‌ట్టిన‌ట్టుగా డ్యాన్స్ చేసేయాలి అనిపించేది. తాత గారి పాట రీమిక్స్ చేసి దానికి డ్యాన్స్ చేయాలి అనే ఆలోచ‌నే కానీ...ఆ పాట‌కు డ్యాన్స్ కు కుదురుతుందా లేదా అనేది ప‌ట్టించుకునేవాడిని కాదు. ఇవ‌న్నీ మార్చుకున్నాను. పాటలో కూడా ప‌ర్ ఫార్మ్ చేయాలి అని తెలుసుకున్నాను.
మీ ఫ్యాన్స్ లో కొంత మంది మీ రూపాన్ని ప‌చ్చ బొట్టుగా వేయించుకున్నారు. అలాంటి ఫ్యాన్స్ ని చూస్తుంటే మీకు ఏమ‌నిపిస్తుంటుంది..?
భ‌యం వేస్తుంటుంది. మ‌మ్మ‌ల్ని అంత‌లా అభిమానించే అభిమానులు ఉండ‌డం అదృష్టం. అభిమానులే నా బ‌లం వారే నా బ‌ల‌హీన‌త కూడా. అయితే...అభిమానం అనేది ఉన్మాదంలా ఉండ‌కూడ‌దు. మితిమీరింది ఏదైనా కూడా మంచిది కాదు..!
ర‌జ‌నీకాంత్ సినిమా కంటే ఎక్కువ‌గా జ‌న‌త గ్యారేజ్ మూవీకి స్పెష‌ల్ షోస్ వేరే రాష్ట్రాల్లో వేస్తున్నారు. మీకేమ‌నిస్తుంటుంది..?
ర‌జ‌నీకాంత్ గారితో న‌న్ను పొల్చ‌ద్దు. ఆయ‌న‌కి నాకు న‌క్క‌కి నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంది (న‌వ్వుతూ...)
త‌దుప‌రి చిత్రం గురించి..?
జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ త‌ర్వాత రెండు నెల‌లు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఆత‌ర్వాత త‌దుప‌రి చిత్రం గురించి నిర్ణ‌యం తీసుకుంటాను..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.