ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ లోగో విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,January 18 2018]

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్రలో సినిమాల నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలా ఎదిగారనే ఓ అంశాన్ని తీసుకుని ..ఓ బయోపిక్‌ను రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

నేడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సందర్బంగా ఆ సినిమా టైటిల్‌లోగో 'ఎన్‌.టి.ఆర్‌'ను విడుద‌ల చేశారు. అందులో ఎన్టీఆర్ చైత‌న్య ర‌థంపై ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న ఫోటో ఉంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రూపొంద‌నున్న ఈ సినిమాను సాయికొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. నిజానికి ఎన్టీఆర్ వ‌ర్ధంతి నాటికి ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించినా.. కుద‌ర‌క‌పోవ‌డంతో. ఈ టైటిల్ లోగోను విడుద‌ల చేశారు.

More News

నాని సినిమాకి మంచి డీల్ కుదిరింది

ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌రుస‌గా ఎనిమిది చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల దండ‌యాత్ర చేశాడు యువ క‌థానాయ‌కుడు నాని. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లుపెట్టి.. గ‌త చిత్రం ఎం.సి.ఎ వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర సాగిస్తున్న ఈ యంగ్ టాలెంటెడ్ హీరో.. అతి త్వ‌ర‌లో కృష్ణార్జున యుద్ధంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు.

బెల్లంకొండ‌కి జోడీగా కీర్తి సురేష్‌?

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌.. ఆ త‌రువాత నేను లోక‌ల్‌తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. తాజాగా వ‌చ్చిన ఆమె మూడో తెలుగు చిత్రం అజ్ఞాత‌వాసి ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌న ఆశ‌ల‌న్నీ త‌దుప‌రి చిత్రం మ‌హాన‌టిపై పెట్టుకుంది.

25 ఏళ్ల 'ముఠామేస్త్రి'

మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. ఆయ‌న న‌టించిన ప‌లు చిత్రాలు మాస్ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేసుకుని రూపొందాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. అలాంటి సినిమాల‌లో 'ముఠామేస్త్రి' ఒక‌టి.

క‌ల్యాణ్ పై ఐటీ దాడి...

'జైసింహా' నిర్మాత సి.క‌ల్యాణ్ ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన త‌ర్వాత ఈ దాడులు జ‌ర‌గ‌డ‌గం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

'నా పేరు సూర్య‌..' శాటిలైట్ రైట్స్ సంచ‌ల‌నం

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఊరు ఇండియా'. అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు అర్జున్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.