నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్.. గౌతమ్ హ్యాట్సాప్: ఎన్టీఆర్

  • IndiaGlitz, [Friday,April 19 2019]

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్-19న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. పలువురు ప్రముఖులు ‘జెర్సీ’ని చూసి నాని నటనను.. సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌‌ను మెచ్చుకుంటున్నారు. ‘జెర్సీ’ చిత్రం చూసిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. దర్శకుడిపై గౌతమ్‌పై ఓ ట్వీట్.. మరో ట్వీట్ నానీ నటన, చిత్రబృందంపై జూనియర్ ట్వీట్ చేశాడు.

గౌతమ్ హ్యాట్సాప్...

గౌతమ్ తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రం అద్భుతంగా ఉంది. ఈ మూవీ నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి కథని ఎంచుకుని, దానిని చక్కగా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సాఫ్. దర్శకుడి విజన్‌కు తగ్గట్లుగా చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు కనిపిస్తోంది అని దర్శకుడిపై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్..

నాని బ్రో.. నువ్వు కొడితే బంతి స్టేడియం బయట పడింది. బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్.. పెర్ఫామెన్స్..! నీ పెర్ఫామెన్స్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని నానీ నటనను ఎన్టీఆర్ మెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే.. యువ క‌థానాయ‌కుల్లో నానిది ప్ర‌త్యేక శైలి అని చెప్పుకోవచ్చు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటున్న నానీ అభిమానులను, సీని ప్రియులను మెప్పిస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో 8 వ‌రుస విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించిన హీరోగా కూడా నాని మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే నాని గ‌త చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, దేవ‌దాస్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ సాధించ‌లేదు. ఇవాళ విడుదలైన ‘జెర్సీ’ మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. విమర్శకులు సైతం ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

More News

శర్వా స్కూబా డైవింగ్

యువ కథానాయుకుడు శర్వానంద్ ఇప్పుడు తమిళ నుండి తెలుగులోకి రీమేక్ అ

బ‌న్ని సినిమాలో మ‌ల‌యాళ నటుడు

ఇప్ప‌డు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ప‌ర భాషా న‌టులు తెలుగులో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు.

ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి ఈసీ షాక్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్ ఇచ్చింది.

దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నా..: మాగంటి రూప

టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం

ధోనీ ఉండటం అదృష్టం.. విమర్శించడం దురదృష్టం: కొహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై కొందరు పనిగట్టుకుని మరీ అనవసర విమర్శలకు దిగుతున్న విషయం విదితమే.