'RRR' కోసం ఎన్టీఆర్ క‌స‌రత్తులు

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం 'RRR'. బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అజయ్‌దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ధారి. ఇంకా సముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్ర‌మిది.ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. త‌దుప‌రి షెడ్యూల్‌ను పూనేలో చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధానంగా యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ ల్లాయిడ్స్ స్టీవెన్స్ ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. చాలా త్యాగం చేశాక అనే కామెంట్‌తో పాటు ఎన్టీఆర్ లెగ్ ఎక్స‌ర్‌సైజ్ ఫొటోను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్ అవుతుంది.

More News

క‌థ‌లోని నిజాయితీ అంద‌రికీ న‌చ్చుతుంది - ఆనంద్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా  దొర‌సాని.

నాన్న కోరిక మేరకే ‘హీరో’ అయ్యా.. ఆ హీరోలిద్దరూ మెచ్చుకున్నారు!

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’.

నేడు భారత్-కివీస్ మధ్య మ్యాచ్.. టాస్ గెలిచినోళ్లదే గెలుపు!

మాంచెస్టర్‌: అద్భుత విజయాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న భారత జట్టు ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.

టీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. ఇప్పుడిక కేసీఆర్ వంతు..!

నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుస షాక్‌లు తగిలిన విషయం విదితమే. ఇప్పుడు టీఆర్ఎస్ వంతు వచ్చింది.

నాని త‌మిళ రీమేక్‌లో అనుప‌మ‌

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ త‌మిళంలో ఓ సినిమా చేయ‌బోతుంది. వివ‌రాల్లోకెళ్తే..