ఏపీలో మరోసారి షాకిచ్చిన కరోనా.. భారీగా కేసుల నమోదు

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

ఏపీలో కరోనా మరోసారి షాకిచ్చింది. తొలిసారిగా బుధవారం 10 వేలు దాటిన కేసులు.. నేడు అంతకంటే మరికొన్ని ఎక్కవే నమోదు కావడం గమనార్హం. ఏపీ కరోనా హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిళ్లను పరీక్షించగా.. 10,167 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 130557కే చేరింది. ప్రస్తుతం ఏపీలో 69,252 యాక్టివ్ కేసులుండగా.. మొత్తంగా 60,024 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 68 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరుకుంది. అయితే కరోనాతో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది, అనంతపూర్, కర్నూలు, విశాఖలో ఎనిమిది మంది, చిత్తూరు, కడపలో ఆరుగురు, ప్రకాశం, విజయనగరంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. నేడు కూడా ఈస్ట్ గోదావరి ల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవడం గమనార్హం.

More News

‘మలుపు’ హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి?

టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా రెండు వర్గాల ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు ఆది పినిశెట్టి. విలన్‌గానూ..

అయోధ్యలో కరోనా కలకలం.. పూజారి సహా 17 మందికి కరోనా..

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చూస్తున్న పూజారి సహా అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు మొత్తంగా 17 మందికి కరోనా సోకింది.

ఏపీలో మోగిన ఉప ఎన్నిక నగారా..

ఏపీలో ఉప ఎన్నిక నగారా మోసింది. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

దేశంలో షాకిచ్చిన కరోనా.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు ఇదే తొలిసారి..

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు కరోనా కేసుల సంఖ్య షాకిచ్చింది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నంటే..

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకూ కరోనా విస్తృతంగా వ్యాపించింది.