YSRCP:సీమలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయం.. పార్టీ నేతల్లో ధీమా..

  • IndiaGlitz, [Wednesday,April 10 2024]

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల విజయావకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం వరకు వైయస్ఆర్‌సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీ అని ప్రచారం జరిగింది. ఎప్పుడైతే సీఎం వైయస్ జగన్ 'సిద్ధం' సభలతో నాలుగు ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ ఆ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. దీనికి తోడు 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టి ఇప్పటికే రాయలసీమ, నెల్లూరు జిల్లాలను చుట్టేశారు. రాయలసీమలో జగన్ అడుగుపెట్టిన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

తొలి నుంచి రాయలసీమ అంటే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019లలో కూడా తన హవా కొనసాగించింది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో 30 సీట్లు గెలిస్తే.. 2019లో ఏకంగా 52 అసెంబ్లీ సీట్లకు 49 గెలుచుకుని ఔరా అనిపించింది. ఈసారి కూడా అదే ఊపు కొనసాగించాలని సీఎం జగన్ పట్టదలతో ముందుకు సాగుతున్నారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఈసారి కూడా 40కి పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడులో నిర్వహించిన 'సిద్ధం' సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు.

గతంలో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ జగన్ బస్సు యాత్ర సాగుతోంది. నెల్లూరు జిల్లాలోనూ కొంత మంది నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండదని భావిస్తున్నారు. ఈసారి కూడా నెల్లూరులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. రాయసీమ జిల్లాల్లో జగన్ యాత్రకు వచ్చిన ప్రజాధరణ చూసిన వైయస్ఆర్‌సీపీ నాయకులు 2019 నాటి సీన్ మళ్లీ రిపీట్ అవడం పక్కా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా రాయలసీమలో ఈసారి కూడా ప్రతిపక్షాలకు ఘోర పరాభవం తప్పదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ఒకటి లేదా రెండు సీట్లు కూడా రావడం కష్టమంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు వైసీపీ నేతలు. గత రెండు సంవత్సరాల నుంచే కుప్పంలో గెలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేసుకుంటూ వస్తున్నారు. కుప్పంలో గెలిచే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. దీంతో ఆయనే ఎక్కువగా అక్కడే ఉంటూ బాబు ఓటమికి ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రబాబును ఓడించి రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తామనే నమ్మకంతో ఉన్నారు.

More News

Ramoji Rao:రామోజీరావుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. మార్గదర్శి కేసులో సంచలన తీర్పు..

లోకం మొత్తానికి నీతులు చెప్పే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు తాను మాత్రం నీతిమాలిన పనులు చేస్తుంటారు.

ప్రభాస్ 'స్పిరిట్' కథ చెప్పేసిన సందీప్ రెడ్డి.. మామాలుగా లేదుగా..

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో దేశవ్యాప్తంగా దర్శకుడు సందీప్ రెడ్డి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో చూపించే హీరో యాటిట్యూడ్‌కి ఓ వర్గం అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Pothina Mahesh: పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారు.. పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు..

జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయారని..

Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ మాటలకు విలువేదీ..? గతంలోనూ తప్పిన అంచనాలు..

ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి బీహార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు

Pothina Mahesh: జనసేన పార్టీకి భారీ షాక్.. కీలక నేత పోతిన మహేష్ రాజీనామా..

ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడలో పార్టీ కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ రాజీనామా చేశారు.