ఊపిరి సీక్వెల్ ప్రకటించిన నాగ్

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఊపిరి చిత్రం అటు త‌మిళ్ - ఇటు తెలుగులో ఫీల్ గుడ్ మూవీగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంటుంది. ముఖ్యంగా ఓవ‌ర్ సీస్ లో రికార్డ్ స్ధాయిలో కేవ‌లం ఐదు రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ ను క్రాస్ చేసి..2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ ను క్రాస్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...ఊపిరి సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని నిన్న చెన్నైలో థ్యాంక్స్ మీట్ జ‌రిగింది.
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున మాట్లాడుతూ...ఊపిరి సీక్వెల్ చేయాల‌నుకుంటున్నాం అని ప్ర‌క‌టించారు. కార్తీ కూడా ఊపిరి సీక్వెల్ చేయ‌నున్నాం అని చెప్పాడు. ఈ విష‌యం హీరోయిన్ త‌మ‌న్నాకి ముందే తెలుస‌నుకుంట‌. అందుకే ఊపిరి సినిమా ప్ర‌మోష‌న్లో ఊపిరి 2 లో నాగ్ సార్ క‌ల‌సి డాన్స్ చేస్తాన‌ని చెప్పింది. ఆత‌ర్వాత స‌ర‌దాగా అన్నాన‌ని చెప్పింది. కానీ..ఇప్పుడు అదే నిజ‌మ‌య్యేలా ఉంది. ఫ్రెంచ్ మూవీ ఇన్ ట‌చ్ బుల్ సినిమాకి సీక్వెల్ చేయ‌లేదు కానీ...ఈ సినిమా స్పూర్తితో రూపొందిన ఊపిరి చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తుండ‌డం విశేషం. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్...ఊపిరి చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున‌.. సూప‌ర్ ఆలోచ‌న‌.

More News

రాశీ ఖన్నా ఇక హైదరాబాద్ అమ్మాయే..

మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి...ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లి భామ రాశీ ఖన్నా.

ఏప్రిల్ లో విజయ్ పోలీసోడు భారి విడుదల

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను  విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు టైటిల్ ను అధికారికం గా ప్రకతిచటం జరిగింది.

ఊపిరి చిత్రానికి వెంక‌య్య‌నాయుడు అభినంద‌న‌లు

మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శనివారం ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

సర్ధార్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే...

పవర్ స్టార్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంతలా హాస్యాన్ని పండించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం.

మళ్లీ 'కందిరీగ' కాంబినేషన్....

ఎనర్జిటిక్ స్టార్ రామ్,కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రాబోతుంది.