close
Choose your channels

సర్ధార్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే...

Saturday, April 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ న‌టించిన అత్తారింటికి దారేది చిత్రంలో బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్ ఎంత‌లా హాస్యాన్ని పండించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కూడా బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్ హైలెట్ గా నిలిచేలా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం పాత్ర పేరు వెప‌న్ టైగ‌ర్. అత‌నో వెప‌న్స్ డీల‌ర్. వెప‌న్స్ కొన‌డానికి వ‌చ్చే క‌ష్ట‌మ‌ర్స్ ని బ్ర‌హ్మి ఇబ్బంది పెడ‌తాడ‌ట‌. ఈ విష‌యాన్ని తెలుసుకుని ప‌వ‌న్ - బ్ర‌హ్మికి త‌గిన బుద్ధి చెబుతాడ‌ట‌.
ప‌వ‌న్ - బ్ర‌హ్మి ల పై చిత్రీక‌రించిన ఈ సీన్స్ ఆడియోన్స్ క‌డుపుబ్బా న‌వ్వుకునేలా ఉంటాయ‌ని టాక్. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని శ‌ర‌త్ మ‌రార్ నిర్మించారు. తెలుగు తో పాటు ఫ‌స్ట్ టైం హిందీలో కూడా స‌ర్ధార్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఫామ్ లోని బ్ర‌హ్మి స‌ర్ధార్ సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.