అక్కినేని అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 13న 'ఊపిరి' థాంక్స్ మీట్

  • IndiaGlitz, [Monday,April 11 2016]

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25ప విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. యు.వెస్‌లో ఊపిరి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూ రెండు మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - ''మా 'ఊపిరి' చిత్రానికి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనే టాక్‌ వచ్చింది. ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ చిత్రాల్లో 'ఊపిరి' కూడా ఒకటి కావడం ఆనందంగా వుంది. మనం, సోగ్గాడే చిన్నినాయ‌నా వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత నాగార్జునగారికి హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచిన 'ఊపిరి' ఈ సమ్మర్‌లో అత్యధికంగా కలెక్ట్‌ చేసే చిత్రం కాబోతోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. యు.ఎస్‌లో రెండు మిలియ‌న్స్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది. ఇలాంటి హ్య‌ట్రిక్ స‌క్సెస్‌ల‌తో నాగార్జున‌గారు చాల హ్య‌పీగా ఉన్నారు. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన అక్కినేని అభిమానుల‌కు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 13న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో అశేష అక్కినేని అభిమానుల స‌మ‌క్షంలో 'ఊపిరి' థాంక్స్ మీట్‌ను నిర్వ‌హిస్తున్నాం'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

More News

వేదాళం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజైంది.దీంతో పవన్ నెక్ట్స్ మూవీ ఏమిటనేది ఆసక్తిగా మారింది. అయితే...తమిళ్ లో ఘన విజయం సాధించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న'రాజా చెయ్యి వేస్తే'

బాణం సినిమా నుండి నేటి వరకు ప్రతి సినిమాను డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’.

ఈ నెలలోనే పవన్ సినిమాకు ముహుర్తమా?

ఏంటి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కదా రిలీజైంది.అప్పుడు మరో మూవీ చేయడమేంటని అనుకునేరు.

మైత్రీ మూవీ మేకర్స్ కి షాకిచ్చిన పవన్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బష్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

దేవిశ్రీకి తప్పలేదు

అదేంటో.. కొన్ని సెంటిమెంట్లు వద్దన్నా వెంటాడుతూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ కి అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తెలుగులో చేసిన సీక్వెల్స్ ఏవీ అచ్చిరావన్నది. ముఖ్యంగా మెగాహీరోలతో చేసినవి. ఇది 'సర్దార్ గబ్బర్సింగ్' విషయంలో మరోసారి రుజువైంది.