Rahul Gandhi: సొంత కారు, ఇల్లు లేదు.. రాహుల్ గాంధీ ఆఫిడవిట్‌లో ఆసక్తికర వివరాలు..

  • IndiaGlitz, [Thursday,April 04 2024]

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అఫిడవిట్‌లో పేర్కొన్న ఆయన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లుగా పేర్కొన్నారు. అయితే సొంత వాహనం, ఫ్లాట్ లేవని పేర్కొనడం గమనార్హం. ఇక ఈ రూ.20 కోట్లలో చరాస్తులు రూ.9.24 కోట్లుగా ఉన్నాయన్నారు. ఇందులో రూ.55వేల నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్‌లు, బాండ్‌లు, షేర్‌ల విలువ రూ.4.33 కోట్లు, మ్యూచ్యువల్ ఫండ్స్ విలువ రూ.3.81 కోట్లు, రూ.15.21 లక్షల విలువైన గోల్డ్ బాండ్స్‌, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు ప్రస్తావించారు.

అలాగే స్థిరాస్తుల విలువ రూ.11.15 కోట్లుగా ఉంది. ఇందులో ఢిల్లీలోని మెహరౌలీలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కలిసి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇక గుడ్‌గావ్‌లో సొంతగా ఆఫీస్‌ ఉందని ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.9 కోట్లుగా ఉందన్నారు. అయితే వారసత్వంగా ఈ భూమి తమకు వచ్చినట్టు వివరించారు. వీటితోపాటు తనపై నమోదైన పోలీస్ కేసుల గురించి కూడా ఆఫిడవిట్‌లో వెల్లడించారు.

గతంలో సోషల్ మీడియాలో అత్యాచార బాధితారులి కుటుంబ సభ్యుల వివరాలు బయట పెట్టినందుకు తన పోక్సో కేసు నమోదైందన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు FIR కాపీ సీల్డ్‌ కవర్‌లో ఉంచారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చారా లేదా అన్నది తెలియదన్నారు. అంతేకాకుండా బీజేపీ నేతలు తనపై వేసిన పరువు నష్టం దావా కేసులు పెట్టారని కూడా పేర్కొన్నారు.

కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసి విజయం సాధించిన రాహుల్.. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 4.10లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. తాజాగా రాహుల్‌పై పోటీగా సీపీఐ నేత రాజా, కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ బరిలోకి దిగారు. దీంతో ఇక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న కేరళలోని 20 నియోజకవర్గాలకు పోలింగ్ జరనుంది.

More News

Fire Accident: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి..

తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.

అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్

అక్రమాస్తుల కేసులో అరెస్టైన రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు భారీ ఊరట దక్కింది. నిర్ణీత సమయం 60 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరైంది.

జూనియర్ ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా: కోన వెంకట్

టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ పలు హిట్ సినిమాలకు కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Konda Surekha: ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో జరగాల్సిన ర్యాలీ