వరంగల్ ఎంజీఎంలో దారుణం: ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి..  విచక్షణారహితంగా కొరికేసిన మూషికాలు

  • IndiaGlitz, [Thursday,March 31 2022]

వేలు, లక్షలు పోసి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. కానీ సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కారణంగా పేదలకు వైద్యం అందడం లేదు. ఒకవేళ అక్కడికి వెళ్లినా ఎన్నో దారుణ పరిస్ధితుల మధ్య గడపాల్సి వుంటుంది. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.

వివరాల్లోకి వెళితే... ఆర్‌ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గతకొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎంలో చేరాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అయితే ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్‌ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు గాయాలకు కట్టుకట్టారు. కానీ గురువారం ఉదయం కూడా శ్రీనివాస్ ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు. మరోవైపు ఎలుకల బెడదపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆర్‌ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో కలిసి ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More News

ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే..?

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది.

రాజ‌కీయాల‌లోకి అనవసరంగా వెళ్లా.. తాప్సీతో ఛాన్స్ మిస్ అయ్యా: చిరు హాట్ కామెంట్స్

అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ పన్ను  తర్వాత బాలీవుడ్ చెక్కేసిన సంగతి తెలిసిందే.

‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ రగడ : కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి, సీఎం హత్యకు కుట్రపన్నారన్న ఆప్

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే..

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం.. ఏప్రిల్ 4 నుంచి పాలన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ‘‘ఉగాది’’ కానుక.... డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ , ఎంతంటే..?

ఉగాది పర్వదినానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ) 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది.