close
Choose your channels

పాతిక కేజీల బియ్యంకాదు.. పాతికేళ్ల భవిష్యత్తే నా లక్ష్యం!

Wednesday, February 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాతిక కేజీల బియ్యంకాదు.. పాతికేళ్ల భవిష్యత్తే నా లక్ష్యం!

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలువురు మేథావులు, ప్రముఖులు, పదవీ విరమణ పొందిన పెద్దలు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో పార్టీ మొత్తం మేథావులతో నిండిపోతోందని.. వీరి సూచనలు, సలహాలతో రానున్న ఎన్నికల్లో పవన్‌‌కు మంచి ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ‌వేదికగా పవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా.. పాతికేళ్ల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌ యువతకు అందించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటువంటి గొప్ప లక్ష్యాన్ని, ఆంధ్రప్రదేశ్‌‌ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే అనేకమంది మేధావులు సలహాలు అత్యంత ఆవశ్యకమన్నారు. అందుకోసమే జనసేన సలహామండలిని ఏర్పాటు చేసినట్లు పవన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో విష్ణు విద్యా సంస్థల అధినేత విష్ణురాజు మేథో సంపత్తిని రాష్ట్ర పురోగతికి ఉపయోగించుకోవాలని మండలి చైర్మన్ బాధ్యతలు స్వీకరించమని కోరగా ఆయన అంగీకరించారు.

పదవులు ఆశించి రాలేదు..!

"భారత రాష్ట్రపతి పదవీ బాధ్యతులు నిర్వర్తించిన స్వర్గీయ అబ్దుల్ కలాంకు 20 ఏళ్లపాటు సలహాదారునిగా పనిచేసిన పొన్నురాజ్‌‌, ఆంధ్రోపాలజీలో నిష్టాతులు, హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటి రిటైర్డ్ ప్రొఫెసర్ సుధాకర్ రావు వంటి మేధావులు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నారు. వీరెవరూ రాజకీయ పదవులు ఆశించి పనిచేయడం లేదు. దేశ, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి విలువైన సలహాలు అందించడానికి వారి వంతుగా కృషి చేస్తున్నారు" అని పవన్ చెప్పుకొచ్చారు.

పుకార్లకు ఫుల్‌స్టాప్!

కాగా.. నరసాపురం లోక్‌‌సభ స్థానం నుంచి జనసేన తరఫున ఓ బడా నేత సిద్ధమవుతున్నారని.. తానే అభ్యర్థినని చెప్పుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఫస్ట్ టైమ్ జనసేన స్పందించింది. ఈ లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీలో నిలబెట్టాలనేది పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ, జనరల్ బాడీ నిర్ణయిస్తుందని.. అంత వరకూ ఎటువంటి ప్రచారాలు జరపవద్దని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.