పవన్‌, నాగబాబు మీకు దమ్ముంటే అడ్డుకోండి!

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సోదరుడు నాగబాబుకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నానని.. దమ్ముంటే పవన్ కల్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని బహిరంగ సవాల్ విసిరారు. పవన్‌కు డ్యాన్స్ చేయడం అస్సలే రాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. వేదికపై పవన్ కల్యాణ్ స్టెప్పులేసి పెద్ద హడావుడే చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పోలిస్తే పవన్‌కు డ్యాన్స్ చేయడం రాదని అన్నారు.

అన్నీ తుప్పుపట్టాయ్!

పవన్, జగన్, చంద్రబాబులకు ఓటు వేయరాదు. వారంతా సీట్లను అమ్ముకుని.. రాష్ట్రాన్ని దోచుకుంటారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తాను. హెలికాప్టర్‌కు, ఫ్యాన్‌కు తేడా కూడా తెలియని జగన్ సీఎం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నాను. అంతేకాదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నాను. నేను ఎమ్మెల్యేగా కూడా పోటి చేయనుండటంతో అందిరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తుప్పుపట్టిన ఫ్యాన్, తుప్పుపట్టిన సైకిల్, పగిలిపోయే గ్లాసు గుర్తులకు ఓటు వేయవద్దు. అధికారంలోకి వస్తే ఏడాదిలో ఏపీని అమెరికా చేస్తాను. మా పార్టీలో అన్ని కులాలకు టికెట్లు ఇస్తున్నాను అని ఆయన చంద్రబాబు, జగన్, పవన్‌‌లపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More News

మంగళగిరిలో వైసీపీని 'లోకేశే' గెలిపించేస్తాడేమో!

ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిన చిత్ర విచిత్రాలన్నీ మంగళగిరిలో చూపిస్తున్నారు.

తప్పు తెలుసుకున్నా.. వైసీపీలో చేరుతా!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీకి కోలుకోలేని షాక్‌‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు

'యురేక' ..ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'యురేక'..ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో  

'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం'  టైటిల్‌ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన నిర్మాత రాజ్‌కందుకూరి

శివ‌, ఉమ‌య్ చంద్‌, ర‌క్ష‌, అక్షిత హీరో హీరోయిన్స్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం 'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం'.

న‌య‌న్... స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌

న‌య‌న‌తార కోసం ఓ నిర్మాణ సంస్థ స్పెష‌ల్ బ‌స్ చేయించింది. బ‌స్సు మూడు వైపులా న‌య‌న‌తార ఫొటోలున్నాయి.