close
Choose your channels

న‌య‌న్... స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌య‌న్... స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌

న‌య‌న‌తార కోసం ఓ నిర్మాణ సంస్థ స్పెష‌ల్ బ‌స్ చేయించింది. బ‌స్సు మూడు వైపులా న‌య‌న‌తార ఫొటోలున్నాయి. వెనుక వైపు మాత్రం మొత్తం ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. ఇంత‌కీ న‌య‌న‌తార కోసం ఆ స్పెష‌ల్ బ‌స్సు ఎవ‌రు చేయించారు? ఎందుకు? అనే డీటైల్స్ లోకి వెళ్దాం. న‌య‌న‌తార న‌టిస్తున్న తాజా సినిమా `ఐరా` ఈ నెల 28న విడుద‌ల కానుంది. స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ్‌లో కేజేఆర్ సంస్థ రూపొందిస్తోంది.

ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా ఓ పెద్ద డీల‌క్స్ బ‌స్సును ప్రిపేర్ చేశారు. ఆ బ‌స్సుకు మూడు వైపులా `ఐరా` పోస్ట‌ర్లున్నాయి. వెనుక వైపు మాత్రం `ఐరా` సినిమాలోని ట్రైల‌ర్స్, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లు, పోస్ట‌ర్లు, న‌య‌న‌తార ఫొటోలు... ఇలా ప్ర‌చారం కోసం చిత్ర యూనిట్ చేసిన‌వ‌న్నిటినీ ప్ర‌చారం చేయ‌నున్నారు. ఈ బ‌స్సు త్వ‌ర‌లోనే అన్నీ ఊళ్ల‌ల్లో తిర‌గ‌నుంది. ఎవ‌రైనా ఆ బ‌స్సును చూస్తే `ఐరా` బ‌స్సు అని ఇట్టే అర్థ‌మైపోతుంది. ఆ మ‌ధ్య ర‌జ‌నీకాంత్ `క‌బాలి` కోసం విమానాల్లో పోస్ట‌ర్లు వేసి ప్ర‌చారాలు చేసిన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.