దెబ్బకు దెబ్బ బలంగా కొడదాం.. పాలకొల్లు జనసేనదే!

  • IndiaGlitz, [Monday,March 18 2019]

విశ్వసనీయత కోల్పోయిన నాయకులు పాలకులైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వయ‌క‌ర్త గుణ్ణం నాగ‌బాబు జ‌న‌సేనలో చేరారు. ఈ సందర్భంగా.. ఆయ‌న్ని పవన్ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పాలకొల్లు జనసేనదే...

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ... ద‌శాబ్దాలుగా ప‌డిన క‌ష్టం ఫ‌లితాన్నివ్వని ప‌రిస్థితుల్లో నాగ‌బాబు ప‌డుతున్న బాధ ఆయ‌న‌పై పోటీ చేయాల్సిన నాయ‌కుల్ని సైతం కదిలించింది. జ‌న‌సేన పార్టీ బ‌ల‌ప‌డాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో స్థానిక జ‌న‌సేన శ్రేణులు సైతం మా అంద‌రికంటే ఆయ‌న అయితే గెలుపు ఖాయ‌మంటూ ఆయ‌న అభ్యర్ధిత్వాన్ని బ‌ల‌ప‌ర్చినందుకు ధ‌న్యవాదాలు.

రాజ‌కీయాల్లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు అరుదుగా జ‌రుగుతాయి. ద‌శాబ్దాలుగా చేసిన శ్రమ‌ని వారు గుర్తించ‌రేమో గానీ, జ‌న‌సేన పార్టీ గుర్తిస్తుంది. జ‌న‌సేన పార్టీ పాల‌కొల్లులో ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుతున్నాం. పాల‌కొల్లు మా కుటుంబానికి హృద‌యానికి ద‌గ్గర‌గా ఉన్న ప్రదేశం. పాలకొల్లులోనే ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని ఇచ్చాను. దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌తో బ‌ల‌మైన అభివృద్ది జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. దెబ్బకు దెబ్బ బలంగా కొడదాంఅన్నారు.

More News

'యాత్ర' డైలాగ్‌ను ఓ రేంజ్‌లో వాడేస్తున్న జగన్!

"నేను విన్నాను.. నేను ఉన్నాను.." ఈ డైలాగ్ ఎక్కడో విన్నామని అనిపిస్తోంది కదూ.. అవును ఇది ‘యాత్ర’ మూవీలోనిదే. ఈ డైలాగ్‌‌‌‌ను వైసీపీ అధినేత

నన్ను.. చంపడానికి ప్లాన్ చేశారా?: పోసాని

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో టాలీవుడ్ నటుడు, డైరెక్టర్, రచయిత పోసాని మురళీ కృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..

వివేకా హత్య: తప్పులో కాలేసిన లోకేశ్

టైటిల్ చూడగానే ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..?.. అసలు వివేకా హత్య కేసు గురించి ఈయనెందుకు మాట్లాడారు..? ఈ విషయంలో ఎందుకు టంగ్ స్లిప్ అయ్యారు..? అనే సందేహాలు వస్తున్నాయ్ కదూ..

బాబుకు ఓటేస్తే ఆంధ్ర దేశం నాశనమైపోతుంది!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటేస్తే 'ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది.. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది' అని టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ పోసాని మురళీ కృష్ణ చెప్పుకొచ్చారు.

ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరోయిన్ పోటీ

'నచ్చావులే' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మాధవీలత రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న ఆమె 2019