పవన్ టీజర్ డేట్ ఫిక్సయ్యింది

  • IndiaGlitz, [Thursday,February 02 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాట‌మ‌రాయుడు'. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌గా న‌టిస్తుంటే క‌మ‌ల్ కామ‌రాజు, శివ‌బాలాజీ, చైత‌న్య‌కృష్ణ‌లు ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్నిడైరెక్టర్ కిషోర్ పార్థసాని(డాలీ) వీలైనంత త‌ర్వగా పూర్తి చేసి ఉగాది కానుక‌గా మార్చి 29న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ టీజ‌ర్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వ‌చ్చింది. టీజ‌ర్ ఇప్పుడో అప్పుడో రిలీజ్ అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై నిర్మాత‌లు త్వ‌రలోనే అంటూ ఫుల్ స్టాప్ పెట్టారు. తాజా స‌మాచారం ప్ర‌కారం నిర్మాత‌లు కాట‌మ‌రాయుడు టీజ‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నామ‌ని త‌మ అధికార‌క ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. అంటే మ‌రో రెండు రోజుల్లో కాట‌మ రాయుడు టీజ‌ర్ కొత్త రికార్డుల‌కు తెర లేప‌నుంద‌న్న‌మాట‌.

More News

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా మల్టీస్టారర్

ఖైదీ నంబర్ 150 చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా మల్టీస్టారర్ రూపొందనుంది.

సూపర్ స్టార్ తో హన్సిక....

మలయాళంతో పాటు దక్షిణాది సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్

'ఆక్సిజన్' షూటింగ్ పూర్తి...

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

'ఘాజీ' సెన్సార్ పూర్తి

దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. . మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈరోజు నేవీ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.

నవలా చిత్రంలో విష్ణు...

లక్కున్నోడు చిత్రం తర్వాత మంచు హీరో విష్ణు అడ్డా దర్శకుడు కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో